భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ప్రాణహిత పుష్కరాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది. పుష్కరాలు 11వ రోజు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో కాళేశ్వరం చేరుకుంటున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.
జీవిత రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ మే 5వ తేదీకి వాయిదా వేసింది.
Advertisement
తెలంగాణ ప్రభుత్వం పై కేంద్రం ప్రసంశలు కురిపించింది. మలేరియా నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు లభించింది. మలేరియా కేసులు గణనీయంగా తగ్గడంపై కేంద్ర ఆరోగ్యశాక ప్రశంసించింది. 25న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు ఆహ్వానం అందింది.
సోమవారం ఆన్ లైన్ లో ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై మాసానికి సంబధించిన ఆర్జిత సేవా టికెట్లు టీటీడీ విడుదల చెయ్యనుంది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు టికెట్ల విక్రయం ప్రారంభం కానుంది.
Advertisement
హైదరాబాద్ నారాయణగూడకు చెందిన ఓ వృద్దుడు సైబర్ నేరగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. మ్యాట్రిమొని సైట్ లో పెళ్లి కోసం తన ప్రొఫైల్ ను అప్లోడ్ చేశాడు. ఆ తరవాత తాను బీటెక్ స్టూడెంట్ అని మిమ్మల్నే పెళ్లాడతా అని ఫేస్ బుక్ లో మెసేజ్ లు వచ్చాయి. ఆ తరవాత చాటింగ్ లో మెల్లిమెల్లిగా మొత్తం 40లక్షల రూపాయాలను వృద్దుడికి మాయమాటలు చెప్పి లాక్కుంది.
ఆస్ట్రేలియాలో ఏపీకి చెందిన విద్యార్థి తనూజ్ చౌదరి ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యాడు. విద్యార్థి దశలో అతడు చేసే కార్యక్రమాలు చూపి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. తనూజ్ వయసు కేవలం 16ఏళ్లు కాగా అతడి కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో వర్షాలు కురుస్తుంటే ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఎప్రిల్ 26 వరకూ ఏపీలో ఎండలు దంచికొడతాయాని ఐఎండీ తాజాగా హెచ్చరికలు జారీచేసింది.
తెలంగాణలో ఈ నెల 25 వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో వాతావరణం చల్లబడి రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.