మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నలుగురు మావోయిస్ట్ లు అరెస్ట్ అయ్యారు. బాపు అలియాస్ రామాజీ దొఘే, మరోటి అలియాస్ అంతురాం, సుమన్ అలియాస్ జన్ని కోమటి కుడ్యమి, అజిత్ అలియాస్ భరత్ మైన హిచామి లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై రూ.16లక్షల రివార్డ్ ఉన్నట్టు సమాచారం.
చెన్నైలోని స్కూల్స్ మరియు కాలేజీల వద్ద డ్రగ్స్ చాక్లెట్ల కలకలం సృష్టిస్తోంది. దాంతో అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అనుమతులు లేని మాల్స్, దుకాణాలను మూసివేస్తున్నారు.
Advertisement
కొమురంభీం, మంచిర్యాల జిల్లాలలో గోదావరి పుష్కరాలు జరుగుతున్నాయి. పదవరోజుకు ఈ పుష్కరాలు చేరుకున్నాయి. అయినప్పటికీ భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.
బీజేపీ కార్యకర్త సాయిగణేష్ మృతి చెందిన విషయం తెలిసిందే. అధికారులు నాయకుల వేధింపుల వల్లే సాయిగణేష్ ఆత్మహత్య చేసుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా నేడు కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఖమ్మంలో సంతాపసభను నిర్వహిస్తున్నారు.
ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది.
Advertisement
మెడికల్ సీట్ల దందాపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వెంటనే నివేధిక ఇవ్వాలని వీసీకి ఆదేశాలు జారీ చేశారు.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి భారీ ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
భారత్ లో 5 నుండి 12 ఏళ్ల మధ్య పిల్లలకు త్వరలోనే టీకాలు వేయాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిపుణుల కమిటీ భేటీ అయ్యింది.
ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే వేయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
శ్రీలంకలో అధ్యక్ష తరహా పాలనను రద్దు చేయాలని దాని స్థానంలో ప్రజాస్వామ్య పాలనను తీసుకురావలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్జేబీ బిల్లును ప్రతిపాదించింది.