మానవ జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని సమపాళ్లలో సక్రమంగా నడిస్తేనే హెల్దీగా ఉంటాం. ఇందులో చాలా ముఖ్యమైంది నిద్ర. కరోనా సమయంలో చాలామంది భయంతో నిద్రలేని రాత్రులు కూడా గడిపారు. అయితే నిద్ర అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..? మనం అతిగా నిద్ర పోతే కూడా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. సమయానికి మనం ఎంత నిద్ర పోవాలో అన్ని గంటలు మాత్రం పోతేనే ఆరోగ్యం అనేది బాగుంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో నిద్ర కు అంతగా విలువ ఇవ్వకుండా డబ్బే లక్ష్యంగా పని చేస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగి రాత్రి సమయాల్లో నిద్ర పట్టక నిద్రలేమికి గురవుతున్నారు.
Advertisement
Advertisement
నిద్రలేకుంటే ఏమవుతుంది: సమయానికి సరిగా నిద్ర లేకపోతే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని ఆస్పత్రుల పాలవుతున్నారు. ఒక రోజు నిద్ర లేకపోతే ఎంత ప్రమాదం ఉంటుందో వైద్యులు తెలుపుతున్నారు.
డిఎన్ఏ లో సమస్యలు: ఒకరోజు నిద్ర భంగం అయితే డిఎన్ఏ లో అనేక మార్పులు వస్తాయని హాంకాంగ్ కు చెందిన షూ వేస్ చాయ్ అనే శాస్త్రవేత్త తెలియజేశారు. నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధన ద్వారా తెలియజేశారు. ఆరోగ్యంగా ఉన్న కొంతమందిపై ఈ పరిశోధన చేసి వివరాలు తెలియజేశారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరి స్తున్నారు.
ALSO READ:
యాంకర్ శ్రీముఖి సినిమాలకు గుడ్ బై చెప్పడం వెనక ఇంత కథ జరిగిందా…!