Home » ఆసిస్ ఆట‌గాళ్లు బూట్ల‌లో డ్రింక్స్ ఎందుకు తాగారంటే..?

ఆసిస్ ఆట‌గాళ్లు బూట్ల‌లో డ్రింక్స్ ఎందుకు తాగారంటే..?

by AJAY

టి20 వరల్డ్ కప్ లో విజ‌యం సాధించిన‌ వెంటనే ఆసీస్ ఆటగాళ్లు త‌మ బూట్ల‌లో డ్రింక్స్ పోసుకుని తాగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అయింది. మ్యాచ్ గెలిచిన వెంటనే విజయానందం తో ఆట‌గాళ్లు తమ బూట్ల‌లో డ్రింక్స్ పోసుకుని తాగారు. అయితే ఆటగాళ్ళు గ్లాసులు లేదా క్యాన్లలో పోసుకుని తాగకుండా షూల‌లో పోసుకుని తాగడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇలా బూట్లలో డ్రింక్స్ పోసుకొని తాగడం అనేది కార‌ణం లేకుండా చేయ‌లేద‌ట‌. దీని వెనక ఓ ఆచారం కూడా ఉందట.

Also Read: క్రికెట్ లో సిక్స్ తో పాటు 8 ఉంటే ! గంభీర్ చెప్పిన రూల్ ఫాలో చేస్తే?

australia cricketers drink beer in shoe

australia cricketers drink beer in shoe

దాంతో త‌మ ఆచారాన్ని ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు క్రికెట్ అభిమానుల‌కు మరోసారి పరిచయం చేశారట. ఈ రకంగా ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడాన్ని షూయి అంటారట‌. బూట్ల‌లో డ్రింగ్స్ పోసుకొని సెలబ్రేట్ చేసుకొనే ఆచారం 18వ శతాబ్దంలో జర్మనీలో మొదలైందని తెలుస్తోంది. భారీగా అదృష్టం వచ్చినప్పుడు లేదంటే సంబరాలు చేసుకునే స‌మయంలో ఇలా చేసేవారట. ఇక జ‌ర్మ‌నీలో మొద‌లైన ఈ ఆచారం ఆస్ట్రేలియాలో ఎంతో పాపులర్ అయింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైనికులు కూడా దాడికి ముందు విజయం తర్వాత బూట్ల‌లో బీరు పోసుకొని తాగే వారట‌.

బూట్ల‌లో బీరు పోసుకుని తాగడం అనేది ఒక అదృష్టంగా భావిస్తారు. ఇదిలా ఉంటే కాళ్లకు వేసుకునే బూట్ల‌లో బ్యాక్టీరియాలు…పరాన్నజీవులు నివాసం ఉంటాయి. అలాంటి బూట్ల‌ లో డ్రింక్స్ తాగడం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా తాగడం వల్ల విజయానందం ఏమోగానీ రోగాల బారిన పడి ఆసుపత్రిలో చేరే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే బూట్ల‌లో హానికర బ్యాక్టీరియా ఉంటుందని అందులో డ్రింక్స్ పోసుకుని తాగితే వాంతులు, విరోచనాలు, నిమోనియా, ఫుడ్ ఇన్ఫెక్షన్ లాంటి రోగాల‌ బారినపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read: కోటి గెలిచిన ఎస్సై గురించి ఈ విష‌యాలు తెలిస్తే అవాక్క‌వ్వాల్సిందే..!

Visitors Are Also Reading