మనం ఎటైనా దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు రైల్లో వెళ్తాం. అందులోని కిటికీ పక్కన కూర్చుని, ఆ కిటికీ లోంచి బయటకు చూస్తూ ఉంటాం. అప్పుడు ఆ కిటికీకి అమర్చిన ఇనుప కడ్డీలు అడ్డంగా అమర్చబడి ఉంటాయి. మరి అవి అలా ఎందుకు ఉన్నాయో.. నిలువుగా ఎందుకు లేవు ఒకసారైనా ఆలోచించారా.. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం..!
మనం రైల్లో వెళ్ళేటప్పుడు బయటనుంచి ఏవైనా తినుబండారాలు వచ్చినప్పుడు అవి తొందరగా తీసుకోవడానికి, అడ్డు కడ్డీలు బిగిస్తారు.
Advertisement
అలాగే అడ్డం కడ్డీలు ఉంటే కాఫీ, టీ కప్పులు ఇలాంటివి చాకచక్యంగా తీసుకోవచ్చు. అలాగే అడ్డం కడ్డీలు చూడడానికి ఇంపుగా ఉంటాయి. అదే నిలువు కడ్డీలు పెడితే అందులో నిర్బంధించిన ఫీలింగ్ మనసులో కలుగుతుంది. ముఖ్యంగా జైలు చువ్వలు, పక్షి పంజరాలు, ఇంటి పెన్సింగ్ ఇలాంటివి నిలువు కడ్డీలతో చేస్తారు. ముఖ్యంగా నిలువు చువ్వల కంటే అడ్డం చువ్వలు తొందరగా వంగుతాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఏదైనా ప్రమాదాలు సంభవించినప్పుడు అడ్డం కడ్డీలు ఉంటే తొందరగా వాటిని పగులగొట్టి బయటపడవచ్చు.
Advertisement
అదే నిలువు కడ్డీలు ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఎక్కువగా ఎమర్జెన్సీ కిటికీలకు అడ్డం చువ్వలు బిగిస్తారు. అప్పుడప్పుడు నిలివు చువ్వలను కూడా గమనించవచ్చు. అయితే అడ్డం కడ్డీలు ఎక్కువగా స్లీపర్ బోగీల్లో మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు కిటికీలోంచి తల బయట పెట్టకుండా, విలువైన వస్తువులు బయట పడేయకుండా, అలాగే బయట నుంచి రాళ్లు ఇంకేదైనా వస్తువులు లోపలికి రాకుండా ఈ అడ్డు కడ్డీలు రక్షిస్తాయి అని చెప్పవచ్చు. అందుకే రైళ్లలో కిటికీల వద్ద ఎక్కువగా నిలువు కడ్డీల కంటే అడ్డం కడ్డీలు ఎక్కువగా బిగిస్తారు.