Home » APRIL 13th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 13th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తెలంగాణ‌లోని మంచిర్యాలలో నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నెల 24వ‌ తేదీ వరకు పుష్కర స్నానాలు జ‌ర‌గ‌నున్నాయి.

గ‌తంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ద్వేషాన్ని పెంచే, వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నేడు నాంపల్లి కోర్టు తీర్పును ఇవ్వ‌నుంది.

Advertisement

నేడు ఐపీఎల్ లో ముంబైతో పంజాబ్ త‌ల‌ప‌డ‌నుంది. పుణె వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. సర్వదర్శనానికి 20 గంటల సమయం ప‌డుతోంది. దాంతో నేటి నుంచి ఈ నెల 17 వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.


భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ తలంబ్రాలు, ప్రసాదాన్ని మంగళవారం ప్రగతి భవన్ లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి క‌లిసి కేసీఆర్ కు అంద‌జేశారు.

Advertisement

 

ఏపీ పౌర‌స‌ర‌ఫ‌రాలశాక కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రేష‌న్ బియ్యం వ‌ద్ద‌నుకునేవారికి డ‌బ్బులు ఇస్తున్నట్టు ప్ర‌క‌టించింది. డ‌బ్బుల‌ను నేరుగా ఖాతాలో వేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఏపీఎల్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఎట్ట‌కేల‌కు ఖాతా తెరిచింది. బెంగుళూరు పై ఘ‌న‌విజ‌యం సాధించింది.

ఏపీలో విడ‌ద‌ల ర‌జినికి మంత్రి గా బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌డంతో తెలంగాణ‌లోని ఆమె స్వ‌గ్రామంలో సంబురాలు జ‌రుపుకుంటున్నారు. విడ‌ద‌ల రజిని స్వ‌గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని కొండాపురం.

corona omricon

corona omricon

ద‌క్షిణాఫ్రికాలో మ‌రో రెండు కొత్త వేరియంట్ లు పుట్టుకువ‌చ్చాయి. బీఏ.4, బీఏ.5 అనే రెండు వేరియంట్ ల‌ను శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

Visitors Are Also Reading