ఐపీఎల్‌లో నేడు చెన్నైతో బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శిస్తారు. కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయనున్నారు.
Advertisement
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు గవర్నర్ తమిళిసై పర్యటించనున్నారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట గ్రామంలోని కొండరెడ్లను గవర్నర్ కలవనున్నారు. 3 గంటల పాటు గ్రామంలోని గిరిజనులతో గవర్నర్ గడిపే అవకాశం ఉంది.
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. కాగా తాజాగా ఆయనకు భారత ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
డీజీల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని అధికారంలో ఉన్న బీజేపీకి ఆ పార్టీ సొంత ఎంపీ విన్నవించుకున్నారు. ముడి చమురు ధరలు తగ్గినందున ధరలు తగ్గించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కోరారు.
Advertisement
కర్నాటక సాంప్రదాయ క్రీడ కంబళలో సరికొత్త రికార్డు నమోదైంది. కంబళ క్రీడలో 100 మీటర్ల దూరాన్ని నిశాంత్ శెట్టి కేవలం 8.36 సెకన్లలో చేరుకున్నాడు.
అంటార్కిటికా సాహస యాత్రలో ఎస్ ఆర్ఎం పూర్వ విద్యార్థి సత్తా చాటింది. ఈ సాహసయాత్రను ఎస్ఆర్ఎం పూర్వవిద్యార్థి మానస గోపాల్ విజయవంతంగా పూర్తిచేసి జెండాను ఎగరవేసింది.
కరోనా నియంత్రించడానికి విధించిన లాక్ డౌన్ వల్లనే శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందని ఆ దేశ ప్రధాని మహింద రాజపక్స అన్నారు. పౌరులు తమ నిరసనలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ రోజు మద్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ధాన్యం కొనుగోలు పై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకు రాని నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. భారత్ అంతా ఒక్కటేనని ఉత్తర దక్షిణ అనే భేదాలు లేవని పేర్కొన్నారు.