సాధారణంగా అయితే అబ్బాయిలు అమ్మాయిల కోసం ఫైటింగ్లు చేస్తారు. ఏ సినిమాలో అయినా కనిపించేది ఇదే. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా అదే జరుగుతుంది కాబట్టి సినిమాల్లో కూడా అలానే చూపిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అబ్బాయిల కోసం అమ్మాయిలు కూడా కొట్టుకుంటున్నారు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే ఇప్పుడు జరుగుతుందోంది. ఇటీవల ఏపీలో ఇద్దరు అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ కోసం ఫైటింగ్ చేశారు.
Advertisement
జుట్టుపట్టుకుని కొట్టుకోవడంతో పక్కన ఉన్నవాళ్లు ఆపకుండా ఎంజాయ్ చేశారు.దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి ఇద్దరు ప్రియురాళ్లు తమ బాయ్ ఫ్రెండ్ కోసం కొట్టుకున్నారు. అది కూడా కాలేజీలోనో క్లాస్ రూమ్ లోనో కాదు. ఏకంగా బస్టాండ్ లో నువ్వా నేనా అంటూ తలపడ్డారు.
Advertisement
దాంతో రొటీన్ గా పక్కన వాళ్లు ఆపకుండా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది దానికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకున్నట్టు సమాచారం. కొట్టుకున్న ఇద్దరు విద్యార్థినులు కూడా ఒకే కాలేజిలో చదువుతున్నారు.
అంతే కాకుండా ఇద్దరూ ఒకే విద్యార్థిని ప్రేమించడమే వీరి మధ్య గొడవకు కారణమైంది. అయితే ఫైట్ చేసిన వారిలో ఒకరు సీనియర్ కాగా మరొకరు జూనియర్ అని సమాచారం. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కాలేజీ యాజమాన్యం ఇద్దరిని సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.