చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి.
నేడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సర్వ ప్రతినిధి సభ అత్యవసర భేటీ అవుతోంది. ఐరాస హెచ్‌ఆర్సీ నుంచి రష్యాను సస్పెండ్ చేసే ప్రతిపాదనపై నేడు ఓటింగ్ నిర్వహించనున్నారు.
Advertisement
నేడు ఏపీ కేబినెట్ చిరరిసారి భేటీ కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సాయంత్రం 3 గంటలకు సచివాలయంలో సమావేశం జరగనుంది, అనంతరం మంత్రులు రాజీనామా పత్రాలు సమర్పించనున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కూడా గవర్నర్ అక్కడే ఉన్నారు. కేంద్రహోం మంత్రి అమిత్ షా తో గవర్నర్ రేపు భేటీ కానున్నారు.
ఏపీలో కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో కరెంట్ కట్ చేయడంతో ప్రసూతి వార్డులో గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉక్కపోతతో రోగులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
మున్సిపాలిటీలో ఘన వ్యర్థాలను బయోమెట్రిక్ విధానంలో సద్వినియోగం చేసుకునే ప్రక్రియ కు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. వ్యర్ధాల నుండి గాజులు, రబ్బరు, చెక్క, ప్లాస్టిక్, ఇనుము ఇతర వస్తువులను రీసైకిల్ చేసి మిగతా వాటిని ఎరువుగా మార్చేలా నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అర్బన్ ఫారెస్ట్ లకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో హరితహారం లో భాగంగా తెలంగాణ అమలు చేస్తున్న పచ్చదనం పునరుజ్జీవన కార్యక్రమాలకు అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది.
ఏపీ సీఎం జగన్ రేపు నంద్యాలలో పర్యటించనున్నారు. జగన్ అన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను విద్యార్థుల ఖాతాల్లో జమ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి పది వేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్లో మరో ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులపై రెచ్చిపోయారు. మక్కామసీద్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవడంతో కార్పొరేటర్ సయ్యద్ సోహెల్ యునాని హాస్పిటల్ గేట్లను తెరిపించారు. దాంతో అక్కడకు పోలీసులు వెళ్లగా…. అసలు మీకు ఇక్కడ ఏం పని ఎందుకు వచ్చారు. పోలీస్ పవర్ చూపిస్తాం అంటే ఇక్కడ నడవదు.. అంటూ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.