అర్ధరాత్రి తరవాత కూడా హోటల్ తెరిచి ఉంచడం తో ఎస్సై కానిస్టేబుల్ వెళ్లి మూసేయాలని కోరగా ఓ కార్పోరేటర్ పోలీసులపైనే దాదాగిరి చూపించాడు. వాళ్లపైనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని భోలక్ పూర్ డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. 2గంటల తరవాత హోటల్ తెరిచి ఉంచడంతో పోలీసులు మూసేయాలని కోరారు. దాంతో అక్కడే ఉన్న భోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ పోలీసులపైనే ఫైర్ అయ్యాడు. రంజాన్ మాసంలో హోటళ్లు తెల్లవార్లు తెరిచే ఉంటాయని చెప్పాడు.
Advertisement
Advertisement
రంజాన్ మాసంలో హెటల్లు తెల్లవార్లు తెరిచే ఉంటాయని అన్నాడు. పోలీసులు తమాషా చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. వచ్చినవాళ్లు డ్యూటీ చేసుకుని వెళ్లిపోవాలని పోలీసులను బెదిరించాడు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని ఓ కానిస్టేబుల్ చెప్పగా…..వంద తీసుకునే నువ్వు నాకు చెబుతున్నావా అంటూ మండి పడ్డాడు. దాంతో కానిస్టేబుల్ నేను వంద తీసుకోవడం నువ్వు చూసావా అంటూ ప్రశ్నించాడు. దానికి ప్రపంచం మొత్తం అలాగే నడుస్తుంది అంటూ వెక్కిలిగా సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా కార్పోరేటర్ వచ్చాడని ఎస్సైని పిలవండి అంటూ ఆర్డర్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.