చైనాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడు లేని విధంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 16,400 కొత్త కేసులు నమోదయ్యాయి.
శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీ ని ఎత్తివేస్తూ ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుండి శ్రీలంకలో ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే.
Advertisement
తెలంగాణ గవర్నర్ తమిళ సై ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ఆమె భేటీ కానున్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఆమోదం… మండలి ప్రోటెం స్పీకర్ నియామకం లాంటి పరిణామాల నేపథ్యంలో ప్రగతి భవన్, రాజ్ భవన్ ల మధ్య దూరం పెరిగింది దాంతో ఇక్కడి విషయాలను షాకు గవర్నర్ వివరించనున్నారు.
రిలయన్స్ అధినేత అంబానీ 90.5 బిలియన్ డాలర్ల సంపదతో మరోసారి ఫోర్బ్స్ నివేదికలో మొదటి స్థానం సంపాదించుకున్నారు. రెండో స్థానంలో అదాని గ్రూప్ చైర్మన్ నిలువగా మూడవ స్థానంలో లో హెచ్ సీ ఎల్ ఛైర్మెన్ శివ్ నాడార్ నిలిచారు.
Advertisement
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీ మరియు కేంద్ర మంత్రులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సీఎం ఏపీ గవర్నర్ తో భేటీ కానున్నారు.
తెలంగాణలో రైతు ఆత్మహత్యల పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొంది.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాదులో విప్రో ఇండస్ట్రీని ప్రారంభించారు.
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు తెలుగు రాష్ట్రాల నుండి బియ్యం సరఫరా చేశారు. పలు ఓడరేవుల నుండి శ్రీలంకకు బియ్యాన్ని తరలించారు.
హైదరాబాద్ లోని ఓయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్నాకలో నార్కోటిక్ వింగ్, ఓయూ పోలీసులు సంయుక్త సోదాలు నిర్వహించారు. 11 మందిని నార్కోటిక్ బృందం అరెస్ట్ చేసింది. గంజాయి హ్యాష్ ఆయిల్ ను వారి వద్ద స్వాధీనం చేసుకున్నారు.
పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిందితులు ఇద్దరు అభిషేక్, అనిల్ ను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. కాగా నిందితుల తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్, కష్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది.