హైదరాబాద్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నేడు అభిషేక్, అనిల్ కుమార్ లను పోలీసులు జైలుకు పంపించనున్నారు.నిన్న రాత్రి ఇద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఇక ఈ పబ్ లో పలువురు ప్రముఖులు పట్టుబడిన సంగతి తెలిసిందే.
ఏపీలో 26 కొత్త జిల్లాలకు కలెక్టర్ కార్యాలయాలను సిద్ధం చేశారు. కలెక్టర్ కార్యాలయాల అడ్రస్ లతో నోటిషికేషన్ ను కూడా జారీ చేశారు.
Advertisement
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ ఈ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కాగా భారత్ లోనూ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పదోతరగతి పుస్తకాల నుండి అమరావతి పాఠాన్ని తొలగించింది. అదే విధంగా వెన్నెల అనే మరో పాఠాన్ని కూడా తొలగించింది. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అయ్యిందని కాబట్టి విద్యార్థుల పై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ పేర్కొంది.
Advertisement
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. నిత్యావసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత రాత్రి కేబినెట్ మంత్రులంతా రాజీనామా చేయగా వెంటనే ఆమోదించడం కూడా జరిగింది.
బీజేపీ వ్యతిరేక కూటమికి తాను సారధ్యం వహించను అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ శరద్ పవార్ అన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెట్రోల్ వాహనాల ధరలకు తగ్గుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ పేర్కొన్నారు.
జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ పోటీలలో తెలంగాణ జట్టుకు కాంస్యపతకం వచ్చింది. తెలంగాణ జట్టును ఓడించి హిమాచల్ ప్రదేశ్ విజేతగా నిలిచింది.
మహరాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందెవాహి ప్రాంతంలో ఆకాశం నుండి ఓ ఇనుప శకలం కిందపడింది. దాంతో పాటూ ఓ సిలిండర్ కూడా కిందపడింది. కాగా ఇనుపశకలం మెరుస్తూ మండుతూ కిందపడినట్టు గ్రామస్థులు గుర్తించారు. ఆ వస్తువు ఏంతో తేల్చే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.
హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో బ్యాంకాక్ గా మార్చేసిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. 2014 వరకూ గ్లోబల్ సిటీగా ఉన్న హైదరబాద్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డగ్స్ సిటీగా మారిందన్నారు.