బిగ్ బాస్ సీజన్-5 లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సి జెశ్వంత్ మొదటి రెండు వారాలు పర్ఫామెన్స్ లో డల్ గా కనిపించినా ఆ తర్వాత మాత్రం టాస్కుల్లో ముందుండి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా షన్ను…సిరితో స్నేహం తర్వాత జెస్సీ కి కెమెరా స్పేస్ కూడా పెరిగింది. అయితే గత రెండు వారాలుగా మాత్రం జెస్సీ అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
Advertisement
టాస్కులు సరిగ్గా ఆడలేక పోతున్నాడు. ఎప్పుడూ మెడ పై చేయి పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆయనను మెడికల్ రూమ్ కు పిలిపించి డాక్టర్ల తో పరీక్ష చేయించారు. కాగా అతడికి వర్టిగో అనే వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. కానీ జెస్సీ కోలుకుంటారని డాక్టర్లు చెప్పినా ఆయన మాత్రం ఇప్పటికీ మరింత నీరసంగా కనిపిస్తూ ఆట కు దూరంగా ఉంటున్నారు.
Advertisement
దాంతో హౌస్ నుండి బయటకు పంపిస్తున్నామని చెప్పి బిగ్ బాస్ సీక్రెట్ రూం లో ఉంచి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. దాంతో జెస్సీకి వచ్చింది అంత పెద్ద వ్యాధా అంటూ చర్చ జరుగుతోంది. అసలు వర్టిగో వ్యాధి అంటే ఏంటి..? అది ప్రమాదకరమా..? దాని లక్షణాలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం…. అయితే బట్టి కో వ్యాధి అంటే ఏమిటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దాం…. వర్టిగో అంటే డిజీనెస్… గిడ్డీ నెస్ అనే పేర్లతో పిలుస్తారు. పురుషుల్లో కంటే మహిళల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి తల తిరగడం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నడుస్తున్నప్పుడు ఎదురుగా గుంతలు ఉన్నట్లు అనిపించడం… ఒక్కసారిగా లోయలో పడిపోతున్నట్టు అనిపించడం, కంటి చూపు మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా గాల్లో తేలుతున్నట్టు, చుట్టూ ఉన్న వస్తువులు మన చుట్టూ తిరుగుతున్నట్లు అనిపించడం లాంటివి కూడా కనిపిస్తాయి. మంచంలో పడుకుని ఉంటే తిరుగుతున్నట్టు.. పై నుండి కింద చూసినప్పుడు పెద్ద లోయాలా కనిపించడం…. ఒకేసారి చీకటి అనిపించడం వంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక ఈ వ్యాధి సాధారణంగా రెండు దశల్లో ఉంటుంది. దానిలో మొదటిది
పెరిఫెరల్ వర్టిగో : లోపలి చెవి లోని నరాలు బలహీన పడటం..చెవి నుండి మెదడుకు సంకేతాలు చేరవ నరాలకు దెబ్బ తగిలినా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినా పెరిఫెరల్ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ దశలో పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. తల తిరగడం లాంటిది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ చెవిలో శబ్దాలు ఎక్కువగా కనిపిస్తాయి. రెండో దశలో సెంట్రల్ వర్టిగో ఉంటుంది. ఇది కాస్త ప్రమాదకరమే…మెదడుకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఈ దశలో ఎక్కువగా వుంటుంది. చెవిలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. మందు సిగరెట్ అలవాటు ఉన్నవారిలో ఈ దశ ఎక్కువగా కనిపిస్తుంది. సెంట్రల్ వర్టిగో లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి లేదంటే మెదడుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.