Home » 18th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

18th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ లో కారు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు నెంబర్ 45లో రోడ్డు దాటుతున్న యాచ‌కుల‌ను కారు ఢీ కొట్ట‌డంతో మ‌హిళ చేతిలో ఉన్న రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. మ‌రో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు.

INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌గ్గ‌ముకం పడుతోంది. అయితే క‌రోనా ఫోర్త్ వేవ్ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.

Advertisement


ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పంజాబ్‌ నుంచి రాజ్యసభకు మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్ ను పంపించాల‌ని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది.

ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య య‌ద్దం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఈ యుద్దం పై నేడు మ‌రోసారి ఉక్రెయిన్ ఉష్యా మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మహమ్మద్ రుహుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకటే నామినేషన్ దాఖలు కావటంతో మహమ్మద్ రుహుల్లా మండలి సభ్యుడిగా ఎన్నికైనట్లు ప్ర‌క‌టించారు.

Advertisement

ష‌బ్ ఎ బ‌రాత్ సంధ‌ర్భంగా హైద‌రాబాద్ లోని ప‌లు ఫ్లై ఓవ‌ర్ ల‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. గ్రీన్‌లాండ్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా అన్ని ఫ్లై ఓవర్లు మూసివేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ద‌మ్ముంటే మంత్రి గంగుల‌పై పోటీ చేసి గెల‌వాల‌ని బండి సంజ‌య్ కి కేటీఆర్ స‌వాల్ విసిరిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా దానిపై జీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కేటీఆర్ బ‌లుపు దింపతామ‌ని అన్నారు. గంగుల‌పై పోటీకీ సాధార‌ణ బీజేపీ కార్య‌కర్త చాల‌ని వ్యాక్యానించారు.

ఈనెల 21న మూడు రాజ‌ధానుల బిల్లును ప్ర‌వేశపెడ‌తామని సీఎం జ‌గ‌న్ అన్నారంటూ సోష‌ల్ డెమోక్ర‌టిక్ రాష్ట్ర అధ్య‌క్షుడు గుర్న‌థం వెల్ల‌డించారు.

క‌ర్నాట‌క‌లో ఓ ఐఏఎస్ అధికారిణి ప్ర‌భుత్వాస్ప‌త్రిలో బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది. క‌ర్నాట‌క‌లోని బ‌ల్లారి జిల్లా ప‌రిష‌త్ సీఈవో గా విధులు నిర్వ‌హిస్తున్న ఎ నందిని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.

Visitors Are Also Reading