పంజాగుట్ట చిన్నారి మృతి కేసుకి సంబంధించి పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేసారు. పంజాగుట్ట చిన్నారి మృతి కేసు లో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు… సీసీ ఫూటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. పోలీసులకు గాంధీ ఆసుపత్రి పోస్ట్ మార్టం నివేదిక అందగా… మరణానికి గల కారణాన్ని గుర్తించారు. కడుపులో బలంగా కొట్టడంతో మృతిచెందినట్లుగా నిర్ధారణకు వచ్చారు.
Advertisement
Advertisement
ఘటన రోజు మొదట అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్య కేసు గా నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఐదు స్పెషర్ టీంలు & టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దింపిన అధికారులు… ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితుల మీద ఫోకస్ చేసారు. వారి కాల్ డేటా తో పాటుగా వారి వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించారు. ఇక తల్లి తండ్రులతో ఎవరికి అయినా గొడవలు ఉన్నాయా అనే దాని మీద కూడా దృష్టి పెట్టారు.