Home » 1-నేనొక్కడినే సినిమా ఫ్లాప్ కావడానికి ఈ నాలుగు కారణాలేనా…?

1-నేనొక్కడినే సినిమా ఫ్లాప్ కావడానికి ఈ నాలుగు కారణాలేనా…?

by Venkatesh
Ad

సుకుమార్ సినిమాలు అర్ధం కావాలి అంటే ఒకటికి రెండు సార్లు చూడాలి. ఆ సినిమాలలో ఉండే కంటెంట్ ఆ రేంజ్ లో ఉంటుంది. కథ ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుందో తెలియకుండా మారుతూ ఉంటుంది. ఇక ఆయన సినిమాలో అర్ధం కాని సినిమా 1-నేనొక్కడినే. అసలు ఈ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో చూస్తే…

కచ్చితంగా ఇది… “ఇంటెలిజెంట్” సినిమా అనే చెప్పాలి. ఇలాంటి మాట వచ్చిన సినిమాలను మల్టిప్లెక్స్ సినిమాలుగా డివైడ్ చేస్తారు. కమర్షియల్ సినిమాలకు ఇది అసలు మంచిది కాదు. సినిమాను అర్ధం చేసుకునే వాడే సినిమాకు రావాలి.

Advertisement

Advertisement

రెండవ కారణం: ఇలాంటి “మల్టిప్లెక్స్” సినిమాలను ప్రేక్షకులు అర్ధం చేసుకోవడం కష్టం. ఇక ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ని బలవంతంగా యాడ్ చేసారనే ఆరోపణలు వచ్చింది. దీనితో స్క్రీన్ ప్లే సరిగా రాలేదు.

మూడవ కారణం: ఈ సినిమా విడుదల తరువాత తగినంత ప్రచారం చేయలేదు. సక్సెస్ మీట్ లాంటి కార్యక్రమాలు లేవు. అసలు ఇంటర్వ్యూలు అనే మాట లేదు. సినిమా కథ గురించి మీడియాలో హడావుడి కూడా లేదు.

నాలుగవ కారణం: సుకుమార్ ఆలోచనలను ప్రేక్షకుడు అందుకోవడం చాలా కష్టం. ఆయన సినిమాను ప్రెజెంట్ చేసే విధానం కాస్త అర్ధం కాలేదు. సినిమా కథ కాస్త సులువుగా ఉంటే సినిమా హిట్ అయ్యేది. క్లైమాక్స్ లో సన్నివేశాలు సినిమాకు బాగా మైనస్ అయ్యాయి.

Visitors Are Also Reading