Home » జాగ్వార్, పాంథ‌ర్ ల‌ను విడిచి ఉక్రెయిన్ వ‌దిలి రానంటున్న ఏపీ వాసిపై చిరు ఆస‌క్తిక‌ర కామెంట్స్…!

జాగ్వార్, పాంథ‌ర్ ల‌ను విడిచి ఉక్రెయిన్ వ‌దిలి రానంటున్న ఏపీ వాసిపై చిరు ఆస‌క్తిక‌ర కామెంట్స్…!

by AJAY
Ad

ఉక్రెయిన్ ర‌ష్యా దేశాల మ‌ధ్య యుద్దం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్యా ఉక్రెయిన్ రాజ‌ధానిని టార్గెట్ గా చేసుకుని బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. దాంతో చాలా మంది ఇంటి నుండి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్ర‌తుకుతున్నారు. ఇక ఆప‌రేష‌న్ గంగ పేరుతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకువ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

అయితే ఉక్రెయిన్ నుండి ఇండియాకు రావ‌డానికి అంతా ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తుంటే ఓ డాక్ట‌ర్ మాత్రం తాను ఇండియాకు రాను అని త‌న పెంపుడు జంతువుల‌కోసం అక్క‌డే ఉండిపోయాడు. ఇక ఆ డాక్ట‌ర్ పేరు గిరికుమార్ కాగా ఆయ‌న త‌న‌కు వాసి. గిరికుమార్ మెడిసిన్ చ‌ద‌వ‌డానికి ఉక్రెయిన్ కు వెళ్లాడు. మెడిసిన్ పూర్త‌య్యాక అక్క‌డే డాక్ట‌ర్ గా స్థిర‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా గిరికుమార్ ఓ పాంథ‌ర్ మ‌రియు జాగ్వార్ ల‌ను పెంచుకున్నాడు.

Advertisement

ఇక యుద్దం జ‌రుగుతున్న నేప‌థ్యంలో వాటిని విడిచిపెట్టి వ‌స్తే అవి తిండి లేక మ‌ర‌ణిస్తాయ‌ని….వాటిని చిరంజీవి హీరోగా న‌టించిన లంకేశ్వ‌రుడు సినిమాను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని రెండు మూగ‌జీవాల‌ను పెంచుకున్నాన‌ని ఓ వీడియోను విడుద‌ల చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. కాగా తాజాగా ఈ వీడియో మెగాస్టార్ చిరంజీవి కంట కూడా ప‌డింది. దాంతో మెగాస్టార్ చిరంజీవి గిర‌కుమార్ చేసిన పనిపై ప్ర‌శంస‌లు కురిపించారు.

chiranjeevi

chiranjeevi

మెగాస్టార్ ట్విట్ట‌ర్ ద్వారా…..ప్రియ‌మైన డాక్ట‌ర్ గిరికుమార్ జాగ్వార్, పాంథ‌ర్ పై మీకున్న ప్రేమ నన్ను ట‌చ్ చేసింది. నాలో స్పూర్తిని నింపింది. ఉక్రెయిన్ లో ప‌రిస్థితులు చూసి కూడా ఇండియాకు రాకుండా మూగ‌జీవాల కోసం అక్క‌డే ఉండాల‌నుకోవ‌డం హృదయాన్ని హ‌త్తుకునే విష‌యం. ఛాలెంజింగ్ నిర్ణ‌యం తీసుకున్న మీరు అక్క‌డ ప‌రిస్థితులు మెరుగయ్యేవ‌ర‌కూ క్షేమంగా ఉండాలి…గాడ్ బ్ల‌స్ యూ…అంటూ చిరు ట్వీట్ లో పేర్కొన్నారు.

Visitors Are Also Reading