Home » తల్లికి ఒట్టు వేసి మాట తప్పిన జగపతి బాబు, అసలు ఏం జరిగింది…?

తల్లికి ఒట్టు వేసి మాట తప్పిన జగపతి బాబు, అసలు ఏం జరిగింది…?

by Venkatesh

టాలీవుడ్ లో కొందరు హీరోలకు లేడీ ఫాలోయింగ్ బాగా ఎక్కువ. అందులో జగపతి బాబు ముందు వరుసలో ఉంటారు. అక్కినేని, శోభన్ బాబు తర్వాత లేడీ ఫాలోయింగ్ ను పెంచుకున్న హీరోగా జగపతి బాబుని చెప్తూ ఉంటారు. ఇప్పుడు విలన్ సహా ఎన్నో పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తున్న జగపతి బాబు కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం, ఆస్తులు అమ్ముకోవడం ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు.

ఇక జగపతి బాబుకి అసలు ముందు సినిమాల్లోకి రావాలి అనే కోరిక ఉండేది కాదట. చెన్నైలో చదువుకునే రోజుల్లో రోజుకి 3 సినిమాలు చూసిన ఆయన… 12 వయసులో తన తల్లికి ఒట్టు వేసారట. తాను సినిమాల్లోకి వెళ్ళే దాని గురించి ఆలోచన చేయను అని. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్ కుమారుడు అయిన జగపతి బాబు… ఆ తర్వాత తన అమ్మగారికి ఇచ్చిన మాట తప్పారు.

Tollywood actor Jagapathi Babu pledges organs on 60th birthday, encourages  friends, fans to support the cause

రాత్రికి రాత్రే సినిమాల్లోకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న జగపతి బాబు… తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చారు. ఈ విషయాన్ని సహాయ దర్శకుడి ద్వారా తెలుసుకున్న జగపతి బాబు తండ్రి… 1989 లో సింహ స్వప్నం సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసారు. తొలి సినిమాతోనే ఆయన డబుల్ రోల్ చేసి సంచలనం సృష్టించారు. కాని ఆ సినిమా ఫ్లాప్ అయింది.

Visitors Are Also Reading