ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా యుద్దం విషయంలో తగ్గేదే అంటుండగా ఉక్రెయిన్ కూడా అదే పంథాతో మందుకు సాగుతోంది. ఇక ఉక్రెయిన్ లో చాలా మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్న సంగతి తెలిసిందే. వారిలో చాలా మందిని ప్రభుత్వం ఇప్పటికే ఇండియాకు తరలించింది. అయితే తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాకు వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నారు.
Advertisement
Advertisement
తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్ర ఉక్రెయిన్ లో ఖార్కివ్ నేషనల్ ఎరోస్పేస్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. 2022లో అతడి చదువు పూర్తికావాల్సి ఉంది. కానీ సాయినికేష్ ఉక్రెయిన్ సైన్యంలో చేరి రష్యాపై పోరాటం చేస్తున్నాడు. విద్యార్థిని సంప్రదించలేకపోవడంతో సాయినికేష్ తల్లిదండ్రులు అధికారుల ద్వారా ఆరా తీశారు. దాంతో సాయినికేష్ ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సాయినికేష్ తల్లిదండ్రులకు తెలిపారు.