ఉక్రెయిన్ రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు దుర్మార్గమని పుతిన్ అన్నారు. పుతిన్ ను ప్రపంచం ఏకాకిని చేయాలంటూ బైడెన్ ఆరోపించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారత రాయబార కార్యాలయం మూసేయాలని నిర్ణయం తీసుకున్నారు. దౌత్య కార్యాలయ సిబ్బందిని ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని వేరే ప్రదేశానికి వెళ్లాలని ఆదేశాలు జారీచేశారు. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతం వీవ్ లో తాత్కాలిక రాయబార కార్యాలయం ఏర్పాటు చేశారు.
Advertisement
ఉక్రెయిన్ లో ఉన్న 20వేల మందిలో 12వేల మందిని సరిహద్దులకు తరలించామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. విద్యార్ధుల తరలింపు కోసం వచ్చే 3 రోజుల్లో 26 విమానాలు నడుపుతామని పేర్కొంది. IAF C-17 విమానం రేపు ఉదయం 4 గంటలకు రొమేనియాకు బయలుదేరుతుందని భారత విదేశాంగశాఖ ప్రకటించింది.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో రెండు రోజుల క్రితం పరిచయమైన వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన యువతిపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.
తాజ్ మహల్ సమీపంలో విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. తాజ్ మహల్ సమీపంలో విమానాలు డ్రోన్లపై నిషేదం విధించగా షాజహాన్ ఉత్సవాల సమయంలో విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది.
Advertisement
వేసవి ఊష్ణోగ్రతలపై భారత వాతావరణ శాఖ తొలి బులిటెన్ ను విడుదల చేసింది. ఒక్క ఉత్తర కోస్తాలో మాత్రం వేసవి ఊష్ణోగ్రతల పెరుగుదల కనిపిస్తుందని ప్రకటించింది. దక్షిణాదిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని ప్రకటించింది.
భాతర క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. అత్యంత ఆధునికమైన లంభోర్ఘిని కారును రోహిత్ శర్మ కొనుగోలు చేశారు.
మళ్లీ ఆర్టీసీ టికెట్ చార్జీలు పెరగనున్నాయి. ఉక్రెయిన్ లో యుద్దం జరుగుతున్న నేపథ్యంలో డీజిల్ ధరలు పెరిగిన కారణంగా ఆర్టీసీపై అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆర్టీసీ చార్జీలు కూడా పెరిగిగే అవకాశం ఉంది.
మోడీ రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. యుద్దానికి ముందే అమెరికా యూకేలు తమ పౌరులను తరలించాయి. కానీ యుద్దానికి 4 రోజుల ముందు ఇండియాకు రావాలని ప్రకటించారు అయితే అప్పటికే విమాన టికెట్ ధరలు ఆకాశాన్ని తాకాయి దాంతో విద్యార్థులు రాలేక చిక్కుకుపోయారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కేసీఆర్ పలువురు రాజకీయ నేతలను కలుస్తారని వార్తలు వినిపించాయి. కానీ కేసీఆర్ కేవలం వైద్యం కోసమే వెళ్లినట్టు సమాచారం.