మంచు ఫ్యామిలీ టైమ్ అస్సలు బాగోలేనట్టు కనిపిస్తోంది. వరుస ఇబ్బందులు మంచు ఫ్యామిలీని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణుపై ట్రోల్స్ పెరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఇంటర్వ్యూలలో చేసిన వ్యాఖ్యలతో మంచు విష్ణు ట్రోల్స్ కు గురయ్యారు. ఇక రీసెంట్ గా ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అనంతరం మంచు విష్ణు ఓ ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డారు. ఆ తరవాత జరిగిన పరిస్థితుల వల్ల మోహన్ బాబు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
Advertisement
ఇదిలా ఉండగానే మోహన్ బాబు హీరోగా నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా విడుదలైంది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో పాటూ విడుదలకు ముందే ఈ సినిమాపై దారుణంగా ట్రోల్స్ మొదలయ్యాయి. ఇది ఇలా ఉంటే మూలుగుతున్న నక్కపై తాటిపండు పడినట్టు ఇప్పుడు మంచు ఫ్యామిలీకి మరో సమస్య వచ్చిపడింది. నిన్న తన వద్ద పనిచేస్తున్న హెయిర్ స్టైలిష్ నాగ శ్రీను ఆఫీసులో రూ.5లక్షల విలువ చేసే సామాగ్రిని దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంపై నాగ శ్రీను ఓ వీడియోను విడుదల చేసి తనను విష్ణు మోహన్ బాబు చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు.
Advertisement
అంతే కాకుండా మోహన్ బాబు తనను కులం పేరుతో దూషించారని మోకాళ్లపై కూర్చోబెట్టి కొట్టారని నాగశ్రీను వెల్లడించారు. తనను కులం పేరుతో దూషించడం వల్లే వారి వద్ద పనిమానేశానని చెప్పారు. అలా పనిమానేశా అనే కోపంతో తప్పుడు కేసులు పెట్టారని నాగశ్రీను ఆరోపించారు. ఇదిలా ఉంటే ఏపీ తెలంగాణకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘాలు మోహన్ బాబు తమకు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోహన్ బాబు తమకు క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు.