భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గుముకం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 6,915 కేసులు నమోదయ్యాయి. 180 మంది కరోనాతో మృతి చెందారు.
తెలంగాణలో పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ ప్రక్రియ మొదలైంది. వాహనాల పెండింగ్ చలాన్ డిస్కౌంట్‌కు విశేష స్పందన వస్తోంది. ప్రతి నిమిషానికి 700 పెండింగ్ చలాన్లను అధికారులు క్లియర్ చేస్తున్నారు.
Advertisement
ప్రభాష్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్‌స సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
మహాశిరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని శివుడి ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి.
హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో గతరాత్రి పేకాట డెన్ పై పోలీసుల దాడులు నిర్వహించారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. 90 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం అందడంతో పేకాట డెన్ పై డీసీపీ సిబ్బందితో కలిసి దాడి చేశారు.
Advertisement
ఉక్రెయిన్ సమస్యపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 11వ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు.
ఉక్రెయిన్ నుండి హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ అండగా నిలుస్తోంది. వారి స్వగ్రామాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది.
కచ్చా బాదామ్ పాట సింగర్ భుదన్ బద్యాకర్ రోడ్డుప్రమాదానికి గురయ్యారు. కచ్చాబాదామ్ పాటతో వచ్చిన పాపులారిటీతో డబ్బు కూడా రావడంతో బద్యాకర్ కారు కొనుకున్నాడు. ఆ కారు నేర్చుకుంటూ ఉండగా భుదన్ బద్యాకర్ రోడ్డుప్రమాదానికి గురయ్యారు.
దేశంలో వాణిజ్య సిండర్ ధర మరోసారి పెరిగింది. సిలిండర్ పై రూ. 105 పెరిగింది. ఢిల్లీ, కలకత్తా, ముంబైలో సిలిండర్ ధర రూ.2000 దాటింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనూ మందు బాబులకు ఊరనిస్తున్నారు. జైలు శిక్ష విధించకుండా జరిమానాతో సరిపెట్టుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.