Home » నిజంగానే వేమన బట్టలు లేకుండా ఉండేవాడా?

నిజంగానే వేమన బట్టలు లేకుండా ఉండేవాడా?

by Azhar
Ad

ఆట‌వెల‌ది ప‌ద్యాల‌తో స‌మాజంలోని మూఢ‌త్వాల‌ను ప్ర‌శ్నించిన క‌వి వేమ‌న‌. ఈయ‌న 17వ శ‌తాబ్దానికి చెందిన క‌విగా పేర్కొంటారు. సిపి బ్రౌన్ ప‌రిశోధ‌నల కార‌ణంగా వేమ‌న రాసిన అనేక ప‌ద్యాలు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే వేమ‌న నిజంగానే బ‌ట్ట‌లు లేకుండా ఉండేవాడా? అనే ప్ర‌శ్న మాత్రం అలాగే మిగిలిపోయింది.

Advertisement

వేమ‌నపై ప‌రిశోధ‌న‌లు చేసిన సిపి బ్రౌన్ , ఆరుద్ర , గోపిలు వేమ‌న దిగంబ‌రుడ‌ని ఎక్క‌డా పేర్కొన‌లేదు. కానీ వేమ‌న‌దిగా చెప్ప‌బ‌డుతున్న ఒక ప‌ద్యం కార‌ణంగా వేమ‌న బ‌ట్ట‌ల‌ను త్య‌జించాడ‌ని అప్ప‌టి నుండి దిగంబరుడిగా ఉన్నాడ‌ని కొంద‌రి అభిప్రాయం.

Advertisement

ఆ ప‌ద్యం:
తల్లిగర్భమందు దా బుట్టినప్పుడు
మొదల బట్ట లేదు తుదను లేదు
నడుమ బట్ట గట్ట నగుబాటు గాదటే?
విశ్వదాభిరామ వినుర వేమ!

వేమ‌న కాలంపై కూడా స్ప‌ష్ట‌మైన ఆధారాలు లేవు..ఆయ‌న వాడిన ప‌దాల‌ను బ‌ట్టి ఆయ‌న 17వ శతాబ్దానికి చెందిన వాడ‌ని ప‌రిశోధ‌కులు అభిప్రాయం ప‌డ్డారు.1920లో రెడ్డివాణి అనే ప‌త్రిక‌లో వేమ‌న‌కు సంబంధించిన దిగంబ‌ర బొమ్మ‌ను ప్ర‌చురించారు. ఆ ప‌త్రిక ప్ర‌తి తంజావూర్ లోని స‌ర‌స్వ‌తి మ‌హాల్ లో ఉంది.

Visitors Are Also Reading