దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గుముకం పట్టింది. దేశంలో కొత్తగా 10,273 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న 243 మంది కరోనాతో మరణించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రేపు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయంలో రోడ్లపై కనిపించినవారిని శత్రువులుగానే పరిగణిస్తామని హెచ్చరించింది. యుద్ధంలో ఇప్పటి వరకు 198 మంది పౌరులు మృతిచెందినట్టు ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Advertisement
నిన్న రాత్రి 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. నిన్న రాత్రి ఉక్రెయిన్ నుంచి 20 మంది విద్యార్థులు ముంబై చేరుకుని అక్కడనుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 469 మంది విద్యార్థులు ఉక్రెయిన్ నుండి భారత్ చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఐదో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. 61 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఐదో విడత బరిలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, సహా పలువురు మంత్రులు ఉన్నారు. అయోధ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది.
Advertisement
తెలుగు రాష్ట్రాలల్లో పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం అయ్యింది. అన్ని ప్రాథమిక వైద్యశాలలో పోలీయో వేస్తున్నారు. అంతే కాకుండా ఏపీలో సంచరజాతుల కోసం పోలియో వాహనాలను ఏర్పాటు చేశారు.
తమిళనాడులో మహిళా కానిస్టేబుల్ ఇందుమది ఆత్మహత్య చేసుకుంది. పనిభారం పెరగటం వల్ల తన పిల్లలను చూసుకోలేకపోతున్నా అంటూ ఇందుమది సూసైడ్ నోట్ లో పేర్కొంది.
కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం జరిగింది. ట్రావెల్ బస్సులో వెళుతున్న ఏపీకి చెందిన మహిళపై బస్సు డ్రైవర్ రాజేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా మహిళ నుండి డబ్బులు దోచుకున్నాడు.
వైసీపీ నాయకుల వేదింపులు తట్టుకోలేకపోతున్నా అంటూ విజయవాడ చిట్టినగర్‌కు చెందిన 48వ డివిజన్ కార్పొరేటర్ ఆదిలక్ష్మి భర్త అత్తులూరి పెదబాబు ఓ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారు. వీడియోలో తాను మరో రెండు రోజుల్లో చనిపోవాలనుంటున్నా అంటూ పేర్చొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
బీజేపీ నేత రాంమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడో తెలియని రాష్ట్రంగా ఏపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. విభజన జరిగి ఏడేళ్లు జరుగుతున్నా రాజధాని ఏదో తెలియదని అన్నారు.