టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాని. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన నాని అతి తక్కువ కాలంలో తన నటనతో నాచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. నాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2017లో అంజన అనే యువతిని నాని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందే వీరిద్దరి మధ్య ఐదేళ్ల పరిచయం ఉంది.
ALSO READ : దర్శకుడు కాకముందు త్రివిక్రమ్ ఏం చేసేవారో తెలుసా..!
Advertisement
వీరిద్దరికి ఓ కుమారుడు పుట్టగా అతడికి అర్జున్ అనే పేరుపెట్టారు. ఇదిలా ఉంటే నాని భార్య అంజన బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంజన తాతగారు ఎరగత్తి నాయుడమ్మ ఓ ప్రసిద్ధ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సేవలకు గానూ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఇక ఎరగత్తి నాయుడమ్మ విమానప్రమాదంలో కన్ను మూశారు.
Advertisement
నాయుడమ్మ కుమారుడి కూతురే అంజన..ఇక ఈమె కూడా సైన్స్ పట్టబద్రురాలు కావడం విశేషం. గుంటురు జిల్లా తెనాలి వద్ద గల ఎరువలు అంజన స్వగ్రామం. నాయుడమ్మకు ముగ్గురు సంతానం కాగా వారిలో పెద్దవాడు అంజన తండ్రి. ఆయన లెదర్ ఫ్యాక్టరీని పెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు. అంజనకు సైన్స్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ ఆమ కమ్యునికేషన్స్ లో మాస్టర్స్ చేసింది.
అంజన తాతగారు నాయుడమ్మ ప్రజల శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1985 జూన్ లో కనిష్క విమాన ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదం జరిగిన విమానంలో 329 మంది చనిపోగా అందులో 120 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ వార్త విన్న నాయుడమ్మ భార్య పవనాబాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. పవనాబాయి మద్రాసులో ప్రముఖ గైనకాలజిస్టుగా సేవలు అందించారు. జీవితంలో భార్యా భర్తలు ఎంతో సక్సెస్ అయినా అనుకోకుండా వచ్చిన ప్రమాదం వల్ల ఇద్దరూ లోకాన్ని విడిచిపెట్టిపోయారు.