ఫోన్ ర్యాం ఎంత ఉంటే అంత మంచిది. లాప్ టాప్ ర్యాం ఎంత ఉంటే అంత మంచిది. కాని ఉద్యోగం చేసుకునే వాళ్లకు ల్యాప్ టాప్ ర్యాం 8 జీబీ ఉంటే ఫోన్ ర్యాం 12 జీబీ ఉంటుంది. ఫోన్ కంటే ల్యాప్ టాప్ పెద్ది కదా మరి… వాడకం కూడా దానితోనే ఎక్కువ కదా మరి. ర్యాం ఎందుకు అంత తక్కువగా ఉంటుంది…? ర్యాం అనేది చాలా వేగంగా పనిచేసే మెమరీ. ఫోన్ లో గాని, లాప్టాప్ లో గాని ప్రాసెసర్ అప్లికేషన్స్ ఈ మెమరీ లో ఉంచి పని చేస్తూ ఉంటుంది.
Advertisement
Advertisement
ఎంత ఎక్కువ రామ్ ఉంటే అన్ని ఎక్కువ అప్లికేషన్లు మెమరీ లో ఉండటంతో ఫోన్ కానీ లాప్ టాప్ కానీ చాలా వేగంగా పని చేస్తాయి. ల్యాప్టాప్ లో మనకి అప్లికేషన్ అవసరం అయిన తర్వాత క్లోజ్ చేసేస్తాం. అప్పుడు అది ర్యాం నుంచి రిమూవ్ అయిపోతుంది. కాని ఫోన్ లో అలా కాదు. అది నిరంతరం మెమరీలో ఉంటే ఫోను స్పీడ్ గా పని చేసే అవకాశం ఉంటుంది. దానితో ఎక్కువ మెమొరీ ఉండే ఫోన్లో అప్లికేషన్లు తొందరగా ఓపెన్ అయినట్టుగా కనపడుతుంది.
దాని కారణం అవి రామ్ లో ఉంటాయి. తక్కువ రామ్ ఉన్నప్పుడు అప్లికేషన్ మెమరీ నుంచి రిమూవ్ అవుతుంది కాబట్టి లోడ్ అయినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని ల్యాప్టాప్ మీద కొద్దిగా ర్యామ్ ఎక్కువగా ఫోన్లో ఉండొచ్చు గాని దానికి ప్రత్యేక కొలమానం అంటూ ఏం లేదు.