Home » జిమ్ ట్రైన‌ర్ కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న నిహారిక‌….వీడియో వైర‌ల్‌..!

జిమ్ ట్రైన‌ర్ కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న నిహారిక‌….వీడియో వైర‌ల్‌..!

by AJAY
Ad

బాలీవుడ్ లో స్టార్ హీరోలు హీరోయిన్ల ఫ్యామిలీల నుండి అమ్మాయిలు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ టాలీవుడ్ లో మాత్రం చాలా అరుద‌నే చెప్పాలి. కానీ టాలీవుడ్ లోనూ మెగా డాట‌ర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది. మొద‌ట‌గా నిహారిక ఢీ డ్యాన్స్ షో ద్వారా యాంక‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యాంక‌ర్ గా అభిమానుల‌ను కూడా సంపాదించుకుంది. ఆ త‌ర‌వాత నిహారిక మ‌రిన్ని టీవీ షోల‌లో సంద‌డి చేసింది. ఇక ఆ త‌ర‌వాత ఏకంగా ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

niharika konidela

niharika konidela

కానీ నిహారిక హీరోయిన్ గా అనుకున్న‌మేర స‌క్సెస్ అవ్వ‌లేకపోయింది. ఇక గ‌తేడాది లాక్ డౌన్ స‌మయంలో గుంటూరు ఐజీ కుమారుడు కృష్ణ చైత‌న్య‌ను నిహారిక ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వివాహం కుటుంబ స‌భ్యుల మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. నిహారిక భ‌ర్త వ్యాపార‌వేత్త కాగా నిహారిక కూడా పెళ్లి త‌ర‌వాత సినిమాల‌కు దూరం అయ్యింది. కానీ నిర్మాత‌గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

Advertisement

Advertisement

ఇటీవ‌లే నిహారిక ఓ వెబ్ సిరీస్ కు నిర్మాత గా వ్య‌వ‌హ‌రించింది. అంతే కాకుండా యూట్యూబ్ లోనూ నిహారిక కంటెంట్ క్రియేట‌ర్ గా చేస్తోంది. మరోవైపు ఇటీవ‌ల మ‌ళ్లీ టీవీలో కామెడీ షోల‌లోనూ సంద‌డి చేసింది. మొత్తానికి పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ నిహారిక అప్పుడ‌ప్పుడూ బుల్లి తెర‌పై మెరుస్తూనే ఉంది. ఇదిలా ఉండ‌గా నిహారిక సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

ఎప్పుడూ త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ త‌న భ‌ర్త‌తో క‌లిసిన ఫోటోల‌ను షేర్ చేస్తూ సంద‌డి చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా నిహారిక త‌న జిమ్ ట్రైనర్ తో డిప్స్ కొట్టిస్తూ ఆ వీడియోను షేర్ చేసింది. అంతే కాకుండా జిమ్ ట్రైన‌ర్ డిప్స్ కొడుతుంటే నిహారిక అత‌డిపై కూర్చుంది. దాంతో అత‌డు చెమ‌టలు కారుస్తూ మ‌రీ డిప్స్ కొట్టాడు. ఇక ఈ వీడియోకు ఇది న‌న్ను ఫిట్ గా ఉంచుతుంద‌ని న‌మ్ముతున్నా అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

Visitors Are Also Reading