Home » 23rd feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

23rd feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా ఉధృతి త‌గ్గుమ‌కం ప‌డుతోంది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో 15102 క‌రోనా కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

Advertisement

నేడు దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి అంత్య‌క్రియ‌లు నెల్లూరు జిల్లాలో జ‌ర‌గ‌నున్నాయి. కాసేప‌ట్లో సీఎం వైఎస్ జ‌గ‌న్ అంత్య‌క్రియ‌ల‌కు బ‌య‌లుదేర‌నున్నారు.

ఉక్రెయిన్ నుండి భార‌తీయుల‌ను త‌ర‌లిస్తున్నారు. ఉక్రెయిన్ నుంచి ఇప్ప‌టికే ఢిల్లీకి 200 మంది పౌరులు చేరుకున్నారు. మూడు విమానాల ద్వారా భార‌తీయుల‌ను త‌ర‌లిస్తున్నారు. రేపు, శ‌నివారం మ‌రో రెండు విమానాలు ఉక్రెయిన్ వెళ్ల‌నున్నాయి.

యూపీలో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది. 9 జిల్లాల పరిధిలో ఎన్నికలు జ‌రుగుతున్నాయి. 59 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జ‌రుగుతుండ‌గా బరిలో 624 మంది అభ్యర్థులు ఉన్నారు.

నేడు శ్రీశైలంలో రెండోరోజు మ‌హాశివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలుర జ‌రుగుతున్నాయి. ఉద‌యం ఆల‌యంలో స్వామి అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. బృంగి వాహ‌నంపై ఆశీనులై ఆదిదంప‌తులు ప్ర‌త్యేక‌పూజ‌లు అందుకోనున్నారు.

Advertisement

మీడియాను ఏపీ ఇంధ‌న‌శాఖ కార్య‌ద‌ర్శి నాగుల‌పల్లి శ్రీకాంత్ హెచ్చ‌రించారు. ఏపీలో క‌రెంటు కోత‌లు అని వార్త‌లు రాస్తే ప‌రువున‌ష్టం దావా వేస్తామ‌ని అన్నారు. ప్ర‌తి రోజూ నిరంత‌రంగా విద్యుత్ ను అందిస్తున్నామ‌ని చెప్పారు.

భార‌త్ పాకిస్థాన్ మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు ప్ర‌ధాని మోడీ ఆస‌క్తి చూపిస్తున్నార‌ని పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తే కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని చెప్పారు.

పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుండి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థి బేటెక్ ర‌వినే అని పార్టీ అధినేత చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. నిన్న పులివెందుల‌లో పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన చంద్ర‌బాబు ఈ విష‌యంపై చర్చించారు.

క‌ర్నాట‌క‌లో చేత‌కాని ప్ర‌భుత్వం ఉంద‌ని మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. బ‌జ‌రంగ్ ద‌ల్ కార్య‌క‌ర్త హ‌త్య‌పై కేటీఆర్ స్పందించారు. హింస ఏరూపంటో ఉన్నా వ్య‌తిరేకిస్తామ‌ని బీజేపీ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శ్రీలంక‌లో ఆర్థిక సంక్షోభం తీవ్ర‌రూపం దాల్చుతోంది. ఆర్థిక సంక్షోభం నేప‌థ్యంలో దేశ‌మంతా విద్యుత్ కోత‌ను విధిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

Visitors Are Also Reading