ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా ఎప్పుడూ కనపిస్తూనే ఉంటుంది. కానీ దక్షిణాదిన మాత్రం బీజేపీకి పెద్ద పట్టుండదు. అయితే ఇటీవల కాలంలో దక్షిణాదిన కూడా బీజేపీ మెల్లి మెల్లిగా పుంజుకుంటోంది. మిగితా రాష్ట్రాల మాట ఎలా ఉన్నా తమిళనాడులో మాత్రం బీజేపీ పత్తా ఉండదు అని విశ్లేషకులు చెబుతుంటారు. దానికి కారణం అక్కడ ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉండటం మరియు ప్రాంతీయ పార్టీల హవా కనిపించడమే…అయితే అక్కడ కూడా ఇప్పుడు బీజేపీ బోణీకొట్టేసింది.
Advertisement
Advertisement
బీజేపీకి అసెబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కలేదు కానీ తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు చూస్తే అక్కడ కూడా బీజేపీ పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. మొదటిసారిగి చెన్నై లోని ఒక వార్డులో బీజేపీ గెలిచింది. అంతే కాకుండా మరో నాలుగైదు వార్డుల్లో రెండో స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకే సత్తా చాటింది. అన్నా డీఎంకే మాత్రం డీలా పడిపోయింది. చైన్నైలోని కొన్ని ప్రాంతాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలవడంతో అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచింది. దాంతో బీజేపీ నేతలకు ఆశలు చిగురించడంతో పాటూ తమిళనాట సంబురాలు చేసుకుంటున్నారు.