ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముకం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,968 కరోనా కేసులు నమోదయ్యాయి. 673 మంది కరోనాతో మరణించారు.
నేడు సాయంత్రం 4 గంటలకు ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. అదే విధంగా ముంబైలో సీఎం ఉద్దవ్ ఠాక్రేతో కూడా సీఎం భేటీ కానున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నారు.
Advertisement
బంగారం ధరలు మళ్లీ పెరుతున్నాయి. తాజాగా బంగారం ధర రూ.50,123 ఉండగా వెండి ధర కిలోకు రూ.63,896గా ఉంది.
కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బీజేపీ కిసాన్ మోర్చా విజయవాడ పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న మల్లారెడ్డిని దుండగులు హతమార్చారు.
యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చేదు అనుభవ ఎదురైంది. ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు ఆయన ర్యాలీ వద్ద ధర్నాకు దిగారు.
Advertisement
కెనడాలో మూడు కాలేజీలు దివాళా తీయడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాలేజీలు దివాళా తీయడం వల్ల అందులో చదువుతున్న మొత్తం 2000 మంది భారతీయ విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
ఏపీ సీఎం జగన్ నేడు కడపలో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం అమ్జద్ పాషా కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఆ తరవత పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో సానియా జంట ఓడిపోయింది. సానియా భారత్ లూసీ చెక్ రిపబ్లిక్ జంట సెమీఫైనల్ లో ఓటమి పాలయ్యింది.
ప్రముఖ ఆన్ లైన్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటి నుండి ఆర్డర్ చేసిన 45 నిమిషాల లోపే గ్రూసరీస్ ను డెలివరీ చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ సేవలను బెంగుళూరులో ప్రారంభించింది.
కరోనా ఉధృతి తరవాత మళ్లీ వివాహాలు మొదలయ్యాయి. మాగమాసం ఈ నెల 21న ముగుస్తుండటంతో ఎక్కడ చూసినా పెళ్లిబాజాలే వినిపిస్తున్నాయి. ఫంక్షన్ హాల్స్ అన్నీ బుక్ అవుతున్నాయి.