మంచు ఫ్యామిలీ పై ఈ మధ్య ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. నిజానికి మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుండి ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ తరవాత విష్ణు ఎక్కడ కనిపించినా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. టంగుటూరి ప్రకాహం పంతులు అని ఓ ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడిన వీడియో దారుణంగా ట్రోల్ అయ్యింది. వీడియోలు, మీమ్స్ ఇలా అన్ని రూపాల్లో ట్రోలర్స్ ఆడుకుంటున్నారు. ఇది వరకే మోహన్ బాబు మంచు విష్ణు ట్రోల్స్ పై స్పందించారు. మోహన్ బాబు ఇండస్ట్రీలోని ఓ ఇద్దరు తమపై ట్రోలింగ్ చేయిస్తున్నారని వారికి అలాంటి గతే వస్తుందని అన్నారు.
Advertisement
Advertisement
అయితే మోహన్ బాబు సన్ ఇండియా సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరవాత ట్రోల్స్ మరింత పెరిగిపోయాయి. ఈ సినిమాకు మహేశ్ బాబు ఏఎంబీ థియేటర్ లో రెండే టికెట్లు అమ్ముడు పోయాయని ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మంచు లక్ష్మి మోహన్ బాబు ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన స్పీచ్ పై కూడా ట్రోల్స్ వచ్చాయి. ట్రోల్స్ పెరిగిపోయిన నేపథ్యంలో పెదరాయుడు మోహన్ బాబు కన్నెర్ర చేశారు.
మోహన్ బాబు ఫ్యామిలీకి చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ హౌస్ సంస్థ ట్రోల్ చేస్తున్నవారికి వార్నింగ్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రొడక్షన్ హౌస్ సీఓఓ శేషు కుమార్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సన్ ఆఫ్ ఇండియా సినిమాపై చేసిన మీమ్స్ ట్రోలింగ్ వీడియోలను కూడా తొలగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అవి తొలగించకపోతే రూ.10కోట్ల పరువునష్టం దావా కట్టేలా నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఎక్కడా కూడా ట్రోల్స్ కనిపించకూడదని హెచ్చరించారు.