Home » ముదురుతున్న‌ హిజాబ్ వివాదం…కాలేజీకి రాలేనంటూ లెక్చ‌ర‌ర్ రాజీనామా..!

ముదురుతున్న‌ హిజాబ్ వివాదం…కాలేజీకి రాలేనంటూ లెక్చ‌ర‌ర్ రాజీనామా..!

by AJAY
Ad

కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం రోజురోజుకు ముదిరిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. దాంతో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించేందుకు నిరాకరించింది. హై కోర్టులో తీర్పు రానిది తాము కేసు గురించి మాట్లాడదలుచుకోలేదు అని స్పష్టం చేసింది. అయితే ఈ క్రమంలో సమస్యను పెద్దది చేయవద్దని సూచించింది. ఈ విషయంలో అన్ని అంశాలను గమనిస్తున్నారని తెలిపింది. సరైన సమయంలో ఈ అంశంపై విచారణ చేపడతామని ఎస్.వి.రమణ స్పష్టం చేశారు.

Advertisement

అంతేకాకుండా విచారణ కర్ణాటక హైకోర్టు నుండి బదిలీ చేయ‌డం… ఈ దశలో జోక్యం సరికాదని సుప్రీం అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే ఈ కేసును కర్ణాటక హైకోర్టు నుండి తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం స్థానానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కోరారు. ఈ వివాదం కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారని ఆయన సుప్రీం దృష్టికి తీసుకు వెళ్లారు. విద్యార్థినులపై దాడులు జరుగుతున్నాయని ఈ వివాదం దేశవ్యాప్తంగా వ్యాపిస్తుందని అన్నారు.

Advertisement

అంతేకాకుండా సుప్రీం నుండి ఎలాంటి ఆదేశాలు కోరడం లేదని కేవలం కేసును విచారణకు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్ధనను పరిశీలిస్తామని సీజేఐ రమణ వ్యాఖ్యానించారు. మరోవైపు బుధవారం కర్ణాటక హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఇదిలా ఉండగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హైకోర్టు ఆదేశాలను పాటించాలని విద్యార్థులంతా కలిసికట్టుగా ఉండాలని విద్యార్థులను కోరారు.

ALSO READ : బీజేపీది బూట‌కపు జాతీయ‌వాదం..మోడీపై మ‌న్మోహ‌న్ సింగ్ ఫైర్..!

అంతేకాకుండా విద్యార్థులు పరీక్షల పై దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ పెండింగ్ లో ఉందని తెలిపారు. మరోవైపు కర్ణాటకలోని కాలేజీ లెక్చరర్ హిజాబ్ ధరించకుండా తను కాలేజీకి రాలేనని చెప్పారు. అంతే కాకుండా హిజాబ్ ను తొలగించడం తన సెల్ఫ్ రెస్పెక్ట్ ను బాధించిందని చెప్పారు. తన ఉద్యోగానికి కూడా లెక్చరర్ రాజీనామా చేశారు.

Visitors Are Also Reading