సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. ముఖ్యంగా హీరోయిన్ లు కాస్టింగ్ కౌచ్ తో ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. కాస్టింగ్ కౌచ్ వల్ల సినిమాలపై ఆసక్తి ఉన్నా దూరమయ్యేవారు కూడా ఉంటారు. ఇక కాస్టింగ్ కౌచ్ పై ప్రతి హీరోయిన్ కూ ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. అయితే చిన్న హీరోయిన్లు…ఇండస్ట్రీలో అవకాశాలు రాని వారు మాత్రమే కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ ఉంటారు. కానీ స్టార్ హీరోయిన్ లు మాత్రం కాస్టింగ్ కౌచ్ అనే ప్రశ్నలు ఎదురైనప్పుడు సమాధానం దాటవేస్తుంటారు.
కాగా మొదటి సారి అనుష్క శెట్టి కాస్టింగ్ కౌచ్ పై స్పందించడం సంచలనంగా మారింది. నాగా చైతన్యకు యోగా టీచర్ గా పనిచేసిన అనుష్క ఆ తారవాత నాగార్జున సలహాతో సినిమాల్లోకి వచ్చింది. అంతే కాకుండ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతోనే అనుష్క టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటూ మొదటి సినిమాతోనే అనుష్క తన గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తరవాత అనుష్క వరుస సిసిమాలు చేసింది.
Advertisement
Advertisement
అంతే కాకుండా అరుంధతి లాంటి లేడీ ఓరియండ్ చిత్రాలతోనూ అనుష్క తిరుగులేని కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. చివరగా భాగమతి అనే సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చిన అనుష్క ఆ తరవాత మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. అయితే తాజాగా అనుష్క ఓ జాతీయమీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అవును టాలీవుడ్ లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పింది. అవకాశాలు ఇస్తామని చెప్పి లోబర్చుకునే సంస్కృతి తెలుగులో కూడా ఉందంటూ బాంబు పేల్చింది. అన్ని పరిశ్రమల్లో ఈ సమస్య ఉందని….కానీ తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి సూటిగా నక్కచ్చిగా మాట్లాడేదానని తాను కూడా అలాంటివి చూశానని తెలిపింది. టాలీవుడ్ లోనూ కొంతమంది మహిళలు లైంగిక వేధింపులతో బాధపడుతున్నారని చెప్పింది.