అందాల చందమామ కాజల్ అగర్వాల్ చిత్రపరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. తమిళ,హిందీ, తెలుగు భాషల్లో కాజల్ హీరోయిన్ గా నటించి అలరించింది. మగదీర సినిమాతో కాజల్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆ తరవాత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ , ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించింది.
అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరవాత ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించే అదృష్టాన్ని సైతం కాజల్ దక్కించుకుంది. అంతే కాకుండా ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ మరోసారి చిరంజీవికి జోడీగా నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా కాజల్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను ప్రేమ వివాహం చేసుకుంది.
Advertisement
Advertisement
అంతే కాదండోయ్ తాను ప్రస్తుతం గర్భవతిని అని కాజల్ గుడ్ న్యూస్ కూడా చెప్పింది. అయితే రీసెంట్ గా కాజల్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంది. అక్కడ బీచ్ లో బేబీ బంప్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే బేబీ బంప్ తో ఉన్న ఫోటోలపై కొంతమంది ఆకతాయిలు ట్రోల్స్ చేస్తారన్న సంగతి తెలిసిందే. కాగా అలాంటి వారికి కాజల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
నాపై బాడీ షేమింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా శరీరంలో జరిగిన మార్పులను ఎంజాయ్ చేస్తున్నాను. అర్థం చేసుకోలేని మూర్ఖులకు చెబుతున్నా గర్భవతి అయ్యాక హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కాస్త బరువు పెరుగటం కామన్. ఇక ప్రెగ్నెన్సీ తరవాత మళ్లీ బాడీ నార్మల్ గా కావడానికి కూడా టైమ్ పడుతుంది అంటూ కాజల్ పేర్కొంది. కొన్నిసార్లు నార్మల్ అవ్వకపోవచ్చు కూడా అంటూ పేర్కొంది.