Home » తగ్గేదె లే….బాలయ్య టాక్ షో మరో రికార్డు…!

తగ్గేదె లే….బాలయ్య టాక్ షో మరో రికార్డు…!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలయ్య ఆహాలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే అనే టాక్ షో కు హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ టాక్ షో తో బాలయ్య రికార్డులు బద్దలు కొట్టినట్టు ఆహా ప్రకటించింది. హలోలో అత్యధికంగా వ్యూవ్స్ సంపాదించుకున్న షోగా బాలయ్య టాక్ షో నిలిచినట్టు ఆహా స్పష్టం చేసింది. ఆహలో 40కోట్ల నిమిషాలకు పైగా బాలయ్య టాక్ షోను ప్రేక్షకులు వీక్షించినట్టు ఆహా ప్రకటించింది. ఇదిలా ఉండగా బాలయ్య టాక్ షోకు టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Balayya

Balayya

బాలకృష్ణ మోహన్ బాబు గెస్ట్ గా ఈ షోను ప్రారంభించారు. ఆ తర్వాత వరుసగా దర్శకులు, నటీనటులు వస్తున్నారు. బాలయ్య షోకు రావడం ద్వారా సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతాయని భావిస్తున్నారు. బాలయ్య టాక్ షోలో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, రానా, అల్లు అర్జున్, రాజమౌళి సహా మరికొందరు సందడి చేశారు. ఇక మిగతా టాక్ షోల మాదిరిగా కాకుండా ఈ టాక్ లో బాలయ్య నచ్చిందే చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.

Advertisement

Visitors Are Also Reading