Home » శ్యామ్ కె నాయుడుకు శ్రీసుధ స్ట్రాంగ్ వార్నింగ్… పోస్ట్ వైరల్…!

శ్యామ్ కె నాయుడుకు శ్రీసుధ స్ట్రాంగ్ వార్నింగ్… పోస్ట్ వైరల్…!

by AJAY
Ad

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శ్యామ్ కె నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని ఐదేళ్ళ పాటు సహజీవనం చేసి ఆ తర్వాత మోసం చేశాడని ఆరోపిస్తూ నటి శ్రీ సుధ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాదులో దీనిపై శ్రీ సుధ ఫిర్యాదు చేయగా ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. అప్పట్లో శ్యామ్ కె నాయుడు ఆధారాలను తారుమారు చేయాలని చూస్తున్నారని శ్రీసుధ ఆరోపించారు. అంతేకాకుండా తనను హత్య చేయాలని శ్యామ్.కె.నాయుడు చూస్తున్నాడు అంటూ అతడికి బెయిల్ ఇవ్వకూడదు అని కోరారు.

Advertisement

srisudha

srisudha

దాంతో శ్యామ్.కె.నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో శ్యాం కె నాయుడుకు ఊరట లభించింది. అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఈ అంశంపై శ్రీ సుధ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను… ఈ కేసును వదిలేది లేదు అంటూ పేర్కొంది. శ్యామ్ కె నాయుడు తనను చిత్రహింసలు పెట్టాడని, లైంగికంగా వేధించారని ఆరోపించింది. దాంతో శ్రీ సుధ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా శ్రీ సుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా యాంకర్ గా కూడా షోలు చేసింది. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో శ్రీసుధ కు గుర్తింపు వచ్చింది.

Advertisement

Visitors Are Also Reading