Home » 8th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

8th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

ఇండియాలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌గా మ‌ర‌ణాల సంఖ్య పెర‌గ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. భారత్‌లో లో గ‌డిచిన 24గంట‌ల్లో 67,597 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. క‌రోనాతో 1,188 మంది మృతి చెందారు. ఇక ప్ర‌స్తుతం ఇండియాలో మొత్తం 9,94,891 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీ పీఆర్సీ సాధన సమితిలో వరుస రాజీనామాల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇప్పటికే జేఏసీ పదవులకు ఏపీటీఎఫ్ రాజీనామా చేయ‌గా నేడు యూటీఎఫ్‌ నేతలు రాజీనామా చేస్తున్నారు.

Advertisement

క‌డ‌ప జిల్లాలో రాజంపేట అన్నమయ్య జిల్లా సాధన కోసం బంద్ కొన‌సాగుతోంది. పలువురు టీడీపీ నేతల గృహ నిర్బంధంలో ఉన్నారు. పోలీసుల బందోబస్తుతో ఆర్టీసీ బస్సులు న‌డుస్తున్నాయి. ప్రైవేట్‌ విద్యాసంస్థలకు యాజమాన్యం సెల‌వు ప్ర‌క‌టించింది.

నేడు జరగాల్సిన టాలీవుడ్‌ సమావేశం వాయిదా పండింది. కొందరు సినీ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో స‌మావేశం వాయిదా ప‌డింది.

పరవాడ ఆక్టినోస్ ఫార్మా కంపెనీలో గ‌త రాత్రిపేలుడు సంబంవించింది. నలుగురు కార్మికులకు గాయాలు కాగా వారిని గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

దక్షిణ, ఆగ్నేయ ప్రాంతాల నుంచి వీస్తోన్న గాలుల కార‌ణంగా తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత త‌గ్గుముఖం ప‌ట్టింది. పలు ప్రాంతాల్లో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.

Ap cm jagan

Ap cm jagan

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలను మార్చి 4వ తేదీ లేదా 7వ తేదీన ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఏపీ స‌ర్కార్ కీల‌క‌మైన కొత్త జిల్లాల బిల్లు మ‌రియు కొత్త రాజ‌ధాని బిల్లును ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశం ఉంది.

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది. ఎప్రిల్ 20 నుండి ఇంట‌ర్ ప‌రిక్ష‌లు ప్రారంభం కానున్నాయి. మార్చి23 నుండి ప్రాక్టిక‌ల్స్ ప్రారంభం కానున్నాయి.

క‌రోనా విష‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. మ‌హ‌మ్మారి ఇప్పుడే పోయేది కాద‌ని ద‌శాబ్దాల పాటు బ‌రించ‌క తప్ప‌ద‌ని పేర్కొంది.


టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జ‌య‌సుధ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అమెరికాలో ఉంటున్న జ‌య‌సుధ క‌రోనా రావ‌డంతో ప్ర‌స్తుతం హోమ్ ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటుంది.

Visitors Are Also Reading