Home » 6th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

6th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆంటిగ్వాలోని సర్ విలియమ్​ రిచర్డ్స్​ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ నిన్న జ‌రిగింది. కాగా దీంతో ఐదో సారి టీం ఇండియా వరల్డ్ కప్ సాధించించి. ఇప్ప‌టి వ‌ర‌ర‌కూ మొత్తం 8 సార్లు టీం ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ కు చేరింది. 5 సార్లు విజయం సాధించ‌గా మూడు సార్లు రన్నరప్ గా నిలిచింది.

Ap cm jagan

Ap cm jagan

ఏపీలో ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలం అయ్యాయి. దాంతో కాసేపట్లో సమ్మె విరమణ చేయ‌నున్న‌ట్టు స్టీరింగ్ కమిటీ ప్ర‌క‌టించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు నోట్ రాసి ఇవ్వ‌నున్నారు. మీడియా సమక్షంలో స్టీరింగ్ కమిటీ సభ్యుల సంతకాలతో ప్రకటన విడుద‌ల చేయ‌బోతున్నారు.

Advertisement

మేడారంలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఆదివారంసెలవు కావడంతో భ‌క్తులు మేడారంకు పోటెత్తుతున్నారు. క్యూలో నిలబడి భక్తులు ద‌ర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీతో సమ్మక్క సారక్క గద్దెలు నిండిపోయాయి.

ఉమ్మడి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా ఆదిలాబాద్ లోని అర్లి టి లో 6.7డిగ్రీలు, బేలాలో 7.7డిగ్రీలు, కొమురం భీం జిల్లా కెరమెరిలో 7.8డిగ్రీలు, వాంకిడిలో 8 డిగ్రీలు. నిర్మల్ జిల్లా పెంబిలో 8.5. మంచిర్యాల జిల్లా కవ్వాల్ 9.2గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

cm kcr

cm kcr

సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధం అవ‌తున్నారు. జ‌న‌గామ జిల్లాతో కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న మొద‌లుకానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో కేసీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యాలు, టీఆర్ఎస్ జిల్లా కార్యాల‌యాల‌ను ప్రారంభించ‌నున్నారు. అనంత‌రం భారీ బ‌హిరంగ స‌భ‌ల‌ను కేసీఆర్ ఏర్పాటు చేయ‌నున్నారు.

త‌న‌పై జరిగిన దాడిపై అస‌దుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. గాంధీని చంపిన వారే త‌న‌పై దాడికి ప్ర‌య‌త్సించార‌ని అన్నారు. ఒక్క ఓవైసీని చంపితే ల‌క్ష‌ల మంది ఓవైసీలు పుట్టుకొస్తార‌ని హెచ్చ‌రించారు.

అసంత‌పురం జేఎన్టీయూ లో ర్యాగింగ్ భూతం క‌ల‌క‌లం రేపింది. అర్ధ‌రాత్రి జూనియ‌ర్ల‌ను పిలిపించి సీనియ‌ర్లు అర్ధ న‌గ్నంగా డ్యాన్సులు చేయించారు. దాంతో 12మందిని స‌స్పెండ్ చేస్తూ జేఎన్టీయూ ఉత్త‌ర్వూలు జారీ చేసింది.

ఏపీలో మార్చి మూడోవారంలో బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 4 లేదా 7 నుండి బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వహించాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తుంది.

హైద‌ర‌బాద్ లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.45,100 ఉండ‌గా 24 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ.49,200 ఉంది. ఇక విజ‌యవాడ‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధ‌ర రూ. .45,100 ఉండ‌గా 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 49,200 గా ఉంది.

గంజాయి సాగు చేస్తున్న రైతుకు ఓ అధికారి రైతు బంధును క‌ట్ చేశాడు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని మ‌ణికొండ ప్రాంతంలో చోటుచేసుకుంది. జి. చంద్ర‌య్య అనే రైతు పొలంలో గంజాయి సాగుచేస్తున్న‌ట్టు గుర్తించి అత‌డికి రైతు బంధును క‌ట్ చేశారు.

Visitors Are Also Reading