Home » న‌టి శ్రీసుధ కేసులో శ్యామ్ కే నాయుడుకు ఊర‌ట‌…!

న‌టి శ్రీసుధ కేసులో శ్యామ్ కే నాయుడుకు ఊర‌ట‌…!

by AJAY
Ad

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్.కె.నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శ్యామ్ కె నాయుడుకు బెయిల్ రద్దు చేయాలంటూ టాలీవుడ్ నటి శ్రీ సుధ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్ట్ శుక్రవారం కొట్టివేసింది. ఇదిలా ఉండగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ళ పాటు సహజీవనం చేసి శ్యామ్.కె.నాయుడు మోసం చేశారని శ్రీ సుధ గతంలో హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆ తర్వాత విజయవాడలో ఓసారి తన కారు పై దాడి జరిగిందని శ్యామ్.కె.నాయుడే ఈ దాడిని జరిపించార‌ని మరోసారి ఫిర్యాదు చేసింది.

Advertisement

srisudha

srisudha

ఇక ఈ కేసులో తన శ్యామ్ కే నాయుడు త‌న బలంతో ఆదారాలు తారుమారు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటూ అప్పట్లో ఆరోపణలు చేసింది. ఇక తాజాగా శ్యామ్.కె.నాయుడితో తనకు ప్రాణహాని ఉందని ఆయన బెయిల్ ను రద్దు చేయాలని శ్రీ సుధ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇక శ్రీసుధ అర్జున్ రెడ్డి తో పాటూ ప‌లు చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించింన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా శ్యామ్ కే నాయుడు ప‌లు చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌నిచేశారు.

Advertisement

Visitors Are Also Reading