టాలీవుడ్ సింగర్ సునిత గతేడాది మాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైవాహిక జీవితంలో సునిత బిజీ ఉన్నారు. అయితే సునితకు ఇదివరకే వివాహం కాగా రామ్ వీరపనేనని ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా ఇదివరకే సునితకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఓ కూతురు మరియు కుమారుడు ఉన్నారు.
Also Read: ఉప్పు నీటితో ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?
Advertisement
Advertisement
అయితే సునిత కొడుకు పేరు ఆకాష్ కాగా ఇప్పడు ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాకు సునిత భర్త రామ్ వీరపనేని సపోర్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీయల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఆకాష్ ఇప్పటికే తన చదువును పూర్తి చేసుకుని ప్రస్తుతం నటనలో మెలుకులు నేర్చుకుంటున్నారు.
అంతే కాకుండా త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటుల వివరాలను కూడా ప్రకటించనున్నారు. ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా సింగర్ గా సునిత టాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ పాటల ద్వారా శ్రోతలను అలరించింది.
Also Read: ఆర్మీ కోసం 117 ఎకరాల విరాళం….సుమన్ నిర్ణయం వెనక అసలు కారణం ఏంటో తెలుసా…!