ఇండియాలో కొత్తగా 2.09 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 989 మంది మరణించారు.
రాజ్యసభ సమావేశాలు ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనున్నాయి. లోక్సభ సమావేశం ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనున్నాయి. కరోనా కారణంగా ప్రతి సభ సభ్యులు విడివిడిగా ఉభయసభల్లో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.
Advertisement
సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో మరియు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తుల రద్దీ పెరిగిపోయింది. తెల్లవారుజాము నుండే స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దాంతో స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణించారు. కాగా ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని కేసీఆర్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Advertisement
దేశవ్యాప్తంగా నిరసనలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. గత రైతు సమస్యలపై జారీ చేసిన లేఖలో ఏ హామీ కూడా ఇప్పటి వరకు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని భారతీయ కిసాన్ యూనియన్ నేత టికాయత్ ఆరోపిస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు.
ప్రముఖ సింగర్ లత మంగేష్కర్ తర్వాత బారిన పడిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఆమె కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 45000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 49,100 వేలు గా ఉంది.
కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ నాయకత్వంలో 2024లోగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాల్లో చలి వణికిస్తోంది. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులు కూడా రాష్ట్రంలో చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన మార్కెట్ విలువల మేరకు రేపటినుండి రిజిస్ట్రేషన్ లు జరగనున్నాయి. పెరిగిన ధరల ఆధారంగా ధరణి పోర్టల్ లో మార్పులు చేస్తున్నారు. ఇక రేపటి నుంచి కొత్త మార్కెట్ విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగనున్నాయి.