సమంత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొన్ని రోజులకే మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించారు. స్టార్ హీరోల పక్కన కూడా నటించారు. సమంత గురించి ఎక్కువగా అంతా మాట్లాడుకుంటారు. సోషల్ మీడియాలో విడాకులకు సంబంధించిన టాపిక్ ని, ఎక్స్ కి సంబంధించిన టాపిక్స్ గురించి అడుగుతుంటారు. తాజాగా మరోసారి తన పెళ్లి టాపిక్ ని తీసుకువచ్చి ప్రజలు సమంత గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.
Advertisement
కొత్త వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రచారంలో భాగంగా సమంత మీడియాలో కనపడుతోంది. విడాకుల గురించి విడాకులు తీసుకున్న వాళ్ల గురించి ఆమె మాట్లాడారు. విడాకులు తీసుకున్నాక మహిళలు ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడారు. ఇద్దరు మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలను నిందిస్తారని ఆమె అన్నారు. తనపై కూడా ఈ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేసినట్లు బాధపడింది. డివోర్స్ తీసుకున్నాక అమ్మాయిలకు ఇది సహజమని.. సెకండ్ హ్యాండ్, ఆమె జీతం వృధా, యుజ్డ్ అనే టాక్స్ తగిలిస్తున్నారని.. ఎందుకు ఇలా చేస్తారని ఆమె బాధపడ్డారు.
Advertisement
Also read:
కష్టాల్లో ఉన్న వాళ్లకు ఆ మాటలు బాధ పెడతాయని అన్నారు. కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన పెళ్లి గౌనుని రీమోడల్ విషయం గురించి సమంత స్పందించారు. పెళ్లి గౌనుని రీ మోడెల్ చేయాలని అనుకున్నప్పుడు బాధపడ్డానని.. ప్రతీకారం తెచ్చుకోవాలని కూడా ప్రయత్నించలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. మొన్న ఒక టాక్ షోలో మాట్లాడుతూ ఎక్స్ కి బహుమతులు ఇవ్వడం కోసం డబ్బులు ఖర్చు పెట్టాలని చాలా డబ్బులు వృధా అయ్యాయని ఆమె చెప్పారు. ఆ విషయాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.