ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న కంగువా సినిమా రిలీజ్ అయింది. మార్నింగ్ షో నుంచి కూడా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించని మేర వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ మూవీ పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. కండువా మూవీ నుంచి 12 నిమిషాలని మేకర్స్ ట్రిమ్ చేయడం జరిగింది. కంగువా కొత్త వర్షన్ ని ఎవరూ పట్టించుకోలేదు అప్పటికే నెగటివ్ టాక్ వచ్చింది. 400 కోట్లతో కంగువా సినిమాని తెరకెక్కించారు. కానీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది.
Advertisement
పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా ఈ స్థాయిలో ఫ్లాప్ అవడం వలన నిర్మాతలకు నిద్ర పట్టని పరిస్థితిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పక్కన ఈ సినిమా రివ్యూ పై విరుచుకు పడుతున్నారు. అలాగే ఇంకో పక్క సూర్య భార్య జ్యోతిక కూడా మూవీలోని తప్పిదాన్ని ఒప్పుకున్నారు. కోపరేట్ చేశారు.
Advertisement
ధనుంజయన్ సినిమా ఫ్లాప్ అని కొందరు కావాలని చెప్తున్నారు అని అన్నారు. నిర్మాత ధనుంజయన్ ఒక యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ సినిమాని ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారని.. రెండు పాజిటివ్ పార్టీలు అండ వాళ్లకి ఉందని అన్నారు. విజయ్, అజిత్ ఫ్యాన్స్ తమ సినిమాని కావాలని టార్గెట్ చేసినట్టు చెప్పారు. సూర్య తమిళ్లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళకూడదు అన్న ఆలోచనలు తొక్కేసారని అన్నారు. నెగిటివ్ గా స్ప్రెడ్ చేసినా పట్టించుకోకుండా జనం సినిమా చూస్తారని అన్నారు.