Home » తాత పక్కన హీరోయిన్ గా పని చేస్తావా? అంటూ అందరూ కామెంట్స్ !

తాత పక్కన హీరోయిన్ గా పని చేస్తావా? అంటూ అందరూ కామెంట్స్ !

by Sravanthi
Ad

శ్రీదేవి, ఎన్టీఆర్ మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. తర్వాత హీరోయిన్ గా మారారు. ఇండియన్ సినిమాను శ్రీదేవి ఏలారు. ఆమె తన నటనతో దుమ్ము దులిపేశారు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవిల కాంబినేషన్ హిట్ కాంబినేషన్. వేటగాడు, బొబ్బిలి పులి ఇలా చాలా సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఎన్టీఆర్ శ్రీదేవి కలిసి నటించిన మొదటి చిత్రం వేటగాడు. కే రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. భారీ విజయాన్ని ఇది అందుకుంది.

ntr-sridevi

Advertisement

ఎన్టీఆర్ తో హీరోయిన్ గా మొదటి అవకాశాన్ని అందుకున్న శ్రీదేవి షాక్ అయిపోయారట. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పనిచేయడం గొప్ప అనుభూతిని. అయితే ఆయన సినిమాలో నటించిన ప్రతి హీరోయిన్ కూడా డ్రీమ్ గర్ల్ అయిపోయారని.. ఆయనతో నేను చేసిన ప్రతి మూవీ, ప్రతి పాట హిట్ అని శ్రీదేవి చెప్పారు.

Advertisement

Also read:

ఒకసారి రాఘవేంద్రరావు శ్రీదేవి తో మాట్లాడినప్పుడు శ్రీదేవి ఆ విషయం మీద షాక్ అయ్యారట. నువ్వు ఒక పెద్ద స్టార్ హీరో పక్కన నటించబోతున్నావని.. ఆ హీరో ఎన్టీఆర్ అని చెప్పారట. అప్పుడు నిజంగా శ్రీదేవి షాక్ అయిపోయారట. నేను ఆయనకు మనవరాలిగా చేశాను. హీరోయిన్ గా ఎలా చేయగలను అని అడిగారట. నువ్వేమీ భయపడద్దు. నేను ఉన్నాను అని రాఘవేంద్రరావు ఆమెకు చెప్పారట. ఎన్టీఆర్ తో నేను మాట్లాడతానని చెప్పారట. ఎన్టీఆర్ కూడా సంతోషంగా ఒప్పుకున్నారట. వాళ్ల మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉన్నా ప్రేక్షకులు అంగీకరించారు. శ్రీదేవి ఎన్టీఆర్ కలిసి అనేక సినిమాలు చేశారు.

Visitors Are Also Reading