Grandhi Kiran: ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఫ్రాన్చైజ్లు ఓనర్లుగా సెలబ్రిటీలు ఉన్నారు. పంజాబ్ ఓనర్ గా ప్రీతీ జింటా ఉన్నారు. కోల్కత్తా నైట్ రైడర్స్ ఓనర్ గా షారుఖ్ ఖాన్, హైదరాబాద్ కి అయితే కావ్య మారన్ ఉన్నారు. తెలుగు వ్యక్తి ఢిల్లీ క్యాపిటల్స్ యజమానిగా ఉన్నారని విషయం మీకు తెలుసా..? అంతా ఈయనపై ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారు. మనిషి చూడడానికి నిండుగా ఉండటమే కాకుండా మొహంపై చిన్నపాటి చిరునవ్వుతో చాలా కూల్ గా కనపడుతున్నారు. ఆయన ఎవరో కాదు గ్రంధి కిరణ్ కుమార్. ఈయన ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్.
Advertisement
వేలం సమయంలో రెండు జట్ల మధ్య ఒక ఆటగాడి కోసం తీవ్రంగా పోటీ ఏర్పడింది అందులో ఒకరు పోటీ నుంచి తప్పుకుంటే మిగిలిన ఒక్కరిని రెచ్చగొడతారు. గ్రంధి కిరణ్ కుమార్ రంగంలోకి దిగి ఆటగాడిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కొంత దూరం వరకు లాక్కొచ్చి తెలివిగా పోటీ నుంచి తప్పుకున్నారు దీంతో ఒక రేటుకి అమ్ముడుపోవాల్సిన ఆటగాడు మరో భారీ ధరకు అమ్ముడైపోతాడు. ఇలా చేయడం వలన అవతల ఫ్రాంచైజ్ డబ్బు ఖాళీ అయిపోతుంది. చాలా సార్లు ఎలా జరిగింది. తెలుగోడి తెలివి మామూలుగా ఉండదు అని చూపిస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
శ్రేయస్ అయ్యర్ గురించి పంజాబ్ ఓనర్ ప్రీతీ జింటాతో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బిడ్డింగ్ వార్ కి దిగారు పంజాబ్ పర్సు, 26.7 కోట్లు ఖాళీ చేయించాడు. ఆర్షదీప్ సింగ్ విషయంలో 18 కోట్ల వరకు తీసుకొచ్చి సైడ్ అయిపోయాడు, స్టార్క్ ని 11.75 కోట్లకు డెడ్ చీప్ రేట్ తో కొన్నాడు. జిఎంఆర్ గ్రూపు బోర్డులో 1999 నుంచి కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు. జిఎంఆర్ చేపట్టే ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో కీలకంగా పనిచేస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న జిఎంఆర్ గ్రూపులో ఈయన కీలక వ్యక్తి.