Home » అల్పపీడనం, వాయుగుండం అంటే ఏమిటి? ఎక్కువశాతం ఒకేచోట ఎందుకు పుడతాయి?

అల్పపీడనం, వాయుగుండం అంటే ఏమిటి? ఎక్కువశాతం ఒకేచోట ఎందుకు పుడతాయి?

by Sravanthi
Ad

తుఫాను గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. తుఫాను జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేస్తాయి. ఆస్తి నష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా కలుగుతుంది. పైగా ఒక్కసారి తుఫాను వస్తుందంటే దాని నుంచి కోలుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అసలు తుఫాను ఎందుకు ఏర్పడతాయి..? ఎలా ఏర్పడతాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. అలాగే అల్ప పీడనం అంటే ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా గాలిలో ఉండే ప్రాంతాన్ని అధిక పీడనం అని పిలుస్తారు. అతి తక్కువ గాలులు ఉండే దానిని అల్పపీడనంగా పరిగణిస్తారు.

cyclone

Advertisement

Advertisement

 

గాలుల్లో కదలికలో మార్పులు జరిగితే ఈ రెండు పీడనాలు కలుగుతాయి. గాలిలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి వేడిగాలి. ఇంకోటి చల్లని గాలి. ఇవి భూమి మీద సముద్రాలు మీద వ్యాపిస్తాయి. వేడిగాలి వేడిగా ఉంటుంది అది పైకి చేరుతుంది. చల్లగాలి నీటి తేమ వలన ఉపరితలంపై ఉంటుంది. సముద్ర ఉపరితలం వేడెక్కడం వలన చల్లగాలిలో ఉండే తేమ ఆవిరి అయిపోతుంది. గాలులు వేడెక్కుతాయి. తేలికగా మారి పైకి వెళ్తాయి.

ఇలా వెళ్ళినప్పుడు గాలిలో ఉండే నీటి ఆవిరి కూడా పైకి వెళ్తుంది. మంచి స్పటికాలుగా మారిపోతుంది. దీనిని అల్పపీడనం అని అంటారు. అదే అల్పపీడనం తీవ్రంగా మారినట్లయితే అది వాయుగుండంగా మారుతుంది మరింత బలపడి తుఫాన్ గా మారుతుంది. ఈ సముద్రంలో సుడల రూపంలో ఉంటుంది. తుఫాన్ వాతావరణం లోకి రావటాన్ని తీరాన్ని తాకడం అని పిలుస్తారు. గాలులు తీరం పైకి గంటకు 61 నుంచి 250 కిలోమీటర్ల కంటే వేగంగా ప్రయాణం చేస్తాయి.

Visitors Are Also Reading