పురుషులు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా 40 దాటిన పురుషులు కొన్ని ఆహార పదార్థాలని తప్పక తెలుసుకోవాలి. వీటిని తీసుకోవడం వలన హెల్త్ చాలా బాగుంటుంది. సాల్మన్ మొదలైన చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటాయి. గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే 40 దాటిన పురుషులు పాలకూర, తోటకూర మొదలైన ఆకుకూరలు తీసుకోవాలి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన కంటి చూపు దెబ్బ తినకుండా ఉంటుంది.
Advertisement
బాదం, జీడిపప్పు తీసుకుంటే కూడా పురుషుల ఆరోగ్యం బాగుంటుంది. 40 దాటిన పురుషులు తృణధాన్యాలని డైట్ లో చేర్చుకోవాలి. వీటిని తీసుకుంటే హెల్త్ బావుంటుంది. బరువు కంట్రోల్లో ఉంటుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే 40 దాటిన పురుషులు బెర్రీస్ ని కూడా డైట్లో చేర్చుకోవాలి. మనకి రకరకాల బెర్రీస్ దొరుకుతాయి. వీటిని తీసుకోవడం వలన మెదడు చురుకుగా పనిచేస్తుంది. గుండె సమస్యలు రావు.
Advertisement
Also read:
Also read:
అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివి తీసుకుంటే ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవచ్చు. మెదడు చురుకుగా పనిచేస్తుంది. లీన్ ప్రోటీన్ కూడా పురుషులు డైట్లో చేర్చుకోవాలి. టమాటాలని కూడా తీసుకోవడం మంచిది. అలాగే గుడ్లని కూడా తీసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!