సమంత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో సమంత ఇప్పటికే పలు సినిమాలు చేసి అందరికీ దగ్గరైంది. దక్షిణాది సినీ నటి సమంత ప్రేమ గురించి మాట్లాడుతూ.. ఇద్దరిని ప్రేమించాలని చెప్పారు. నాగచైతన్యని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు హ్యాపీగా ఉన్నారు. సమంత తర్వాత 2022లో విడాకులు తీసుకున్నారు. అయితే సమంత నాగచైతన్య కి ముందు సిద్ధార్థతో ప్రేమలో పడ్డారు అని కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని కార్యక్రమాల్లో కూడా వీళ్ళు కనిపించారు. తర్వాత మాత్రం సమంత సిద్ధార్థని దూరంపెట్టారు. అందుకని సమంత గురించి సిద్ధార్థ పోస్టులు పెట్టే వారని ప్రచారం కూడా ఉంది.
Advertisement
ఇవి ఎంత వరకు నిజమనేది తెలియదు. సమంత ప్రేమకథలు గురించి అందరికీ తెలుసు. కానీ ఆమె జీవితంలో ఇంకో ప్రేమ కథ ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు. ఆమె స్కూల్ రోజుల్లో ఉన్నప్పుడు పప్పీ లవ్ దాని గురించి సమంత షేర్ చేసుకున్నారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో అబ్బాయిని సమంతని రెండేళ్లు ఫాలో అయ్యారట. ఓ రోజు మాట్లాడలేదట ఎందుకు ఫాలో అవుతున్నావు అని సమంత అడిగితే.. నేను నిన్ను ఫాలో అవుతున్నానని ఎవరు చెప్పారు అని అతను అడిగాడట. అది విన్న సమంత బాధపడి తనను ప్రేమిస్తున్నాడో లేదో అర్థం కాలేదట.
Advertisement
Also read:
అప్పట్లో అది విచిత్రంగా అనిపించినా ఒక మంచి మెమరీగా మిగిలిందని సమంత చెప్పారు. మోడల్ గా సమంత కెరీర్ ని స్టార్ట్ చేసి ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. చైతన్యతో విడాకులు అయిపోయిన తర్వాత శారీరక, మానసిక సమస్యల్ని ఎదుర్కొన్నారు. సమంత హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడిల్ లో నటించారు పెద్దగా విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం మా ఇంటి బంగారంలో నటిస్తున్నారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!