నిహారిక కొణిదెల గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. ఆమె గురించి ఆమె వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలుసు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది. తర్వాత హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ తగిన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్యను ఆమె పెళ్లి చేసుకున్నారు ఎక్కువ రోజులు తన భర్తతో ఉండలేకపోయింది. విడాకులు తీసుకుంది. ఆమె పెళ్లి జీవితం అలా అవుతుందని అసలు అనుకోలేదని.. త్వరగా విడిపోతానని ఏ రోజు అనుకోలేదని తర్వాత నిహారిక చెప్పారు.
Advertisement
మెగా అభిమానులు కూడా నిహారికపై మండిపడ్డారు. ఆ టైంలో నిహారికను విపరీతంగా ట్రోల్ చేశారు కూడా. సోషల్ మీడియాలో నిహారిక తప్పే అని ప్రచారం కూడా జోరగా జరిగింది. పెళ్లయిన ఏడాదికి విడాకులు తీసుకుంటారని అస్సలు ఊహించలేదని ఓ ఇంటర్వ్యూలో నిహారిక చెప్పుకొచ్చారు. దెబ్బ తగిలిన వారికి నొప్పి ఏంటో తెలుస్తుంది అని చెప్పారు.
Advertisement
Also read:
పెళ్లి, విడాకులు ఈజీ కాదని.. భవిష్యత్తు గురించి ఆలోచించి విడాకులు తీసుకున్నానని అన్నారు. జొన్నలగడ్డ చైతన్య ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. నిహారిక మాజీ భర్త చైతన్య పెళ్లి చేసుకోబోయేది నిహారిక క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!