ఎక్కడ చూసినా ఏపీలో పోలీసులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. తాజాగా పిఠాపురం టూర్ లో మహిళలపై అత్యాచారాలు గురించి పోలీసుల వైఖరి పై పవన్ కళ్యాణ్ రెచ్చిపోయారు. దళిత మహిళ హోంమంత్రి వంగలపూడి అనిత పై విమర్శలు చేస్తే ఆ సందర్భానుసారం అనుకున్నారు. కానీ ఏకంగా పవన్ క్యాబినెట్ లోని పోలీసులను టార్గెట్ చేశారని తెలుస్తోంది. పైగా ఈ వివాదం ఇక్కడితో ఆగేటట్టు కనపడట్లేదు.
Advertisement
వైసీపీ నేతలు పోస్టులు చేస్తున్న కూడా పట్టించుకోరా అంటూ క్యాబినెట్ భేటీలో పోలీసుల గురించి పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు వైసీపీ నేతలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోరా అని సీఎం చంద్రబాబుతో పాటుగా మంత్రివర్గ సహచరులని అడిగారు. పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఇది వరకు జగన్ కి వత్తాసు పలికిన పోలీసులు ఇప్పటికీ పోస్టుల్లో ఉన్నారని చెప్పారు.
Advertisement
Also read:
ఇలా అయితే ఎలా అంటూ పవన్ కళ్యాణ్ అడిగారు. కొందరు ఎస్పీ లకి ఫోన్ చేసినా రియాక్ట్ అవ్వట్లేదు అని కింద స్థాయిలో ఉన్నా DSPలు, సీఐ లపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని చెప్పారు. తను పిఠాపురంలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని అన్నారు. దీంతో నేరుగా సీఎం రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు మాట్లాడుకుందామని పవన్ కి చంద్రబాబు సూచించారు. నెల రోజుల్లో పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని చెప్పారు. లా అండ్ ఆర్డర్ ఉంటుందో చూపిద్దామని చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!